News March 19, 2025

సంగారెడ్డి: పరీక్షకు 96.63% హాజరు

image

సంగారెడ్డి జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో బుధవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 96.63% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు.18,616 మంది విద్యార్థులకు గాను 17,989 మంది విద్యార్థులు హాజరయ్యారని, 627 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

Similar News

News March 19, 2025

వేగవంతంగా కమర్షియల్ ట్రేడ్ వసూలు చేయండి: బల్దియా కమిషనర్

image

కమర్షియల్ ట్రేడ్ వేగవంతంగా వసూలు చేయాలని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. కమర్షియల్ ట్రేడ్ పన్ను వసూళ్లపై ప్రజారోగ్య విభాగ ఉన్నతాధికారులు డిప్యూటీ కమిషనర్లతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన సూచనలు చేశారు. ప్రతి రోజు పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్న కమర్షియల్ షాపుపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు.

News March 19, 2025

టిక్‌టాక్ రీల్ అనుకరిస్తూ కోమాలోకి బాలిక

image

టిక్‌టాక్ రీల్ అనుకరిస్తూ ఓ బాలిక కోమాలోకి వెళ్లింది. USలోని మిస్సోరి ఫెస్టస్‌కు చెందిన స్కార్లెట్ సెల్బీ(7) టిక్‌టాక్‌లో నీడో క్యూబ్‌ ఆకృతిని మార్చే రీల్ చూసింది. దాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని రీల్‌లో చూపించినట్లు ఆ క్యూబ్‌ను తొలుత ఫ్రీజ్ చేసి ఆపై ఒవెన్‌లో ఉంచింది. దానిని బయటికి తీసినప్పుడు క్యూబ్‌ పేలి, అందులోని వేడి ద్రవం ఆమె ముఖం, ఛాతిపై పడింది. కొంత నోరు, ముక్కులోకి చేరడంతో కోమాలోకి వెళ్లింది.

News March 19, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

> అల్లూరి పోలీసులకు ధన్యవాదాలు చెప్పిన మహిళలు
> కొయ్యూరు: మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ
> రంపచోడవరంలో బాల్య వివాహాల అనర్థాలపై వినతి
> అల్లూరిలో 92మంది దూరం
> గృహ నిర్మాణానికి రూ.10లక్షలు ఇవ్వాలని ముంచంగిపుట్టులో నిరసన
> కాఫీ రైతులకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ సూచన
> ముసురిమిల్లి ప్రాజెక్టులో తగ్గిపోతున్న నీటిమట్టం
> డ్వాక్రా సొమ్ము అవినీతిపై దర్యాప్తు చేయాలని రాజవొమ్మంగిలో నిరసన

error: Content is protected !!