News February 3, 2025
సంగారెడ్డి: పరీక్షల షెడ్యూల్ విడుదల

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర యాజమాన్యాల పాఠశాలలకు మార్చి 6 నుంచి 15 వరకు పదో తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన రివైజ్డ్ షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసిందన్నారు. పరీక్షలు మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Similar News
News April 14, 2026
IPL: త్వరలోనే SRH జట్టులోకి కమిన్స్?

SRH కెప్టెన్ పాట్ కమిన్స్ జట్టులోకి ఎప్పుడు తిరిగొస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇండియా వచ్చి మళ్లీ ఆస్ట్రేలియా వెళ్లిన ఆయనకు రేపు అక్కడ ఫిట్‌నెస్ టెస్ట్ జరగనున్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. ఈ నెల 17న ఆయన ఇండియాకు వస్తారని తెలిపింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఆయన జట్టులో చేరే అవకాశం ఉంది. కొన్ని నెలలుగా ఆయన వెన్నునొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.
News April 14, 2026
రంగారెడ్డిలో 40 దాటింది.. జాగ్రత్త!

రంగారెడ్డిలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఇబ్రహీంపట్నం పరిధి దండుమైలారంలో గరిష్ఠంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మాడ్గుల్, ఎలిమినేడు ప్రాంతాల్లో 41.7 డిగ్రీలు, బోడకొండ, రాచులూరు ప్రాంతాల్లో 41.6 డిగ్రీలు నమోదయ్యాయి. యాచారం, మొయినాబాద్, కడ్తాల్ ప్రాంతాల్లో కూడా 41 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎండలో బయటకు వెళ్లకపోవడం మంచిదని నిపుణులు సూచించారు.
SHARE IT
News April 14, 2026
నిర్మల్: ఆడపిల్ల పేరిట రూ.5వేలు, 2 శ్రీగంధం మొక్కలు

నిర్మల్‌లోని అనంత్ పేట సర్పంచ్ సునీత ‘మా ఊరి బంగారు తల్లి’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఊరిలో ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆ పాప పేరు మీద బ్యాంకులో రూ. 5వేలు జమ చేయడంతో పాటు 2 శ్రీగంధం మొక్కలు బహుమతిగా అందజేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆడపిల్ల భవిష్యత్‌కు భరోసా ఇచ్చేందుకు ఈ కార్యక్రమం చెపట్టామని సునీత తెలిపారు.


