News March 20, 2025
సంగారెడ్డి: ‘పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్‌లు బంద్’

జిల్లాలో రేపటి నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్‌లను మూసివేయాలని జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు సజావుగా జరిగేందుకు పరీక్ష కేంద్రాల సిబ్బంది అందరూ కృషి చేయాలని కోరారు.
Similar News
News March 22, 2025
TODAY TOP STORIES

* ముంతాజ్ హోటల్ భూముల రద్దు: చంద్రబాబు
* చెన్నై చేరుకున్న రేవంత్, కేటీఆర్
* BRS వల్ల ఒక జనరేషన్ నాశనం: భట్టి
* సీఎంతో హరీశ్, పద్మారావు భేటీ
* పోసానికి బెయిల్ మంజూరు
* మంత్రి ఫరూక్ ఇంట తీవ్ర విషాదం
* తెలంగాణలో గాలి, వాన బీభత్సం
* ఆరోజు ప్రధాని మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు: చిరు
* న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ స్టన్నింగ్ విన్
News March 22, 2025
రోడ్డు ప్రమాద బాధితులకు రూ.6లక్షల పరిహారం: విశాఖ సీపీ

విశాఖ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా బాధితులకు శుక్రవారం రూ.6లక్షల పరిహారం అందజేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇటీవల హిట్ రన్ ప్రమాదంలో చనిపోయిన మల్లిపాటి సూర్యనారాయణ, పైల సూరిబాబు, కొట్యాడ సూర్యప్రభ కుటుంబాలకు రూ.2లక్షలు చొప్పున రూ.6లక్షలు అకౌంట్‌లలో డిపాజిట్ చేసినట్లు సీపీ తెలిపారు. ఇప్పటి వరకూ 24 మంది బాధితులకు రూ.15 లక్షలు అందించామన్నారు.
News March 22, 2025
కూటమి ఎమ్మెల్యేలు స్కిట్లు వేసుకోవాల్సిందే: పేర్ని

AP: కూటమి ఎమ్మెల్యేలు స్కిట్లు వేసుకుని బతకాల్సిందేనని YCP నేత పేర్ని నాని ఎద్దేవా చేశారు. త్వరలోనే ప్రజలు వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. ‘మా పార్టీ నేతల అరెస్టులతో జగన్ పరపతి ఏమీ తగ్గలేదు. రెడ్ బుక్ రాజ్యాంగం మమ్మల్ని ఏమీ చేయలేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే జగన్‌కే సాధ్యం. ఈ విషయంలో చంద్రబాబు, పవన్.. జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సిందే’ అని ఆయన వ్యాఖ్యానించారు.