News October 22, 2025
సంగారెడ్డి: ‘పర్యాటక కేంద్రంగా మంజీరా’

మంజీరా తీరాన పర్యటక అడ్వెంచర్ హబ్ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రాజెక్టు పనులపై అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మంజీర నది తీరంలో ప్రకృతి వైభవాన్ని వినియోగించుకోవడం ఎంతో అవసరమని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Similar News
News October 22, 2025
తెలంగాణ రౌండప్

* జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు 280కిపైగా నామినేషన్లు దాఖలు. ఇవాళ నామినేషన్లను పరిశీలించనున్న అధికారులు.. ఉపసంహరణకు 24వరకు గడువు
* ఈ నెల 25లోపు ‘తెలంగాణ రైజింగ్’ సర్వేలో పాల్గొనాలన్న ప్రభుత్వం.. ఇప్పటికే 3 లక్షల మంది పాల్గొన్నారని వెల్లడి
* రేపు మంత్రివర్గ భేటి. స్థానిక ఎన్నికలు, రిజర్వేషన్లపై చర్చ
* ఎప్‌సెట్ బైపీసీ ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి.. బీ ఫార్మసీలో 96.67% మందికి సీట్లు అలాట్.
News October 22, 2025
కార్తీకం: ఆకాశ దీపం అంటే?

కార్తీక మాసంలో దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి ‘ఆకాశ దీపం’ ఏర్పాటుచేస్తారు. చిన్న రంధ్రాలున్న ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఇంటి దగ్గర తులసికోట పక్కన పొడవైన కొయ్యదీప స్తంభానికి దీపాన్ని వెలిగిస్తారు. దీని వెలిగించడం వల్ల అపార జ్ఞానం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆకాశ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని, దీనివల్ల వారు దివ్యలోకాలను పొందుతారని వివరిస్తున్నాయి.
News October 22, 2025
పొద్దున నిద్ర లేవగానే ఇలా చేస్తే.. అన్నీ శుభాలే!

ఉదయం నిద్ర లేవగానే కొన్నింటిని దర్శిస్తే ఆ రోజంతా శుభాలు కలుగుతాయి. అరచేతుల్లో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పొద్దున్నే వాటిని చూసుకోవాలని పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం.. తులసి మొక్కను చూస్తే, ముల్లోకాలలోని పవిత్ర తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. గోవు, అగ్నిహోత్ర దర్శనం కూడా మంచి ఫలితాలనిస్తుంది. ఈ నియమాలను పాటిస్తే.. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని పండితులు సూచిస్తున్నారు.