News January 25, 2025
సంగారెడ్డి : పాఠశాలను సందర్శించిన డీఈవో

సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను డీఈఓ వెంకటేశ్వర్లు శనివారం సందర్శించారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, పాఠశాల రికార్డులు, విద్యార్థులు చదువుతున్న తీరును పరిశీలించారు. డీఈఓ మాట్లాడుతూ.. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Similar News
News September 14, 2025
భద్రత, పరిశుభ్రతలో రాజీపడే ప్రసక్తే లేదు: కలెక్టర్

ప్రయాణికుల భద్రత, బస్టాండ్ పరిశుభ్రతలో రాజీపడే ప్రసక్తే లేదని కలెక్టర్ లక్ష్మీశా పేర్కొన్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్లాట్‌ఫామ్‌లతో పాటు తాగునీటి పాయింట్లు, మరుగుదొడ్ల పరిసరాలను పరిశీలించారు. ఏ సమయంలోనైనా అపరిశుభ్రత అనే మాట వినిపించకూడదన్నారు. ప్రయాణికుల ఆహార భద్రతకు భరోసా కల్పించేలా పరిశుభ్రతా చర్యలు తీసుకోవాలన్నారు.
News September 14, 2025
రామ్మోహన్‌ను కలిసిన అంబేడ్కర్ యూనివర్సిటీ రిజిస్టార్

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఎచ్చెర్ల నూతన రిజిస్టార్‌గా నియమితులైన ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య నేడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాన్ని అందించారు. తనపై నమ్మకం ఉంచి ఇచ్చిన ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు వైస్ ఛాన్స్‌లర్‌కు ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. యూనివర్సిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.
News September 14, 2025
‘బీజేపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అభివృద్ధిని వివరించండి’

దేశ ఆర్థిక వ్యవస్థ 2014లో 11వ స్థానంలో ఉండగా మోదీ నేతృత్వంలో ఇప్పుడు మూడో స్థానానికి చేరిందని
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. విశాఖలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రక్షణ రంగం, రహదారులు, పోర్టులు, రైల్వేలు, వైద్య కళాశాలలు, విమానాశ్రయాలు ఇలా అన్ని రంగాల్లో విస్తృత అభివృద్ధి సాధించామని పేర్కొన్నారు. కార్యకర్తలు గ్రామ గ్రామానికీ వెళ్లి NDA అభివృద్ధిని వివరించాలని పిలుపునిచ్చారు.