News October 29, 2025
సంగారెడ్డి: పాఠశాలలకు 50 శాతం నిధులు విడుదల

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు 50 శాతం నిధులను విడుదల చేస్తూ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ఈ నిధులను రెండు రోజుల్లో పాఠశాలల్లోని ఖాతాలో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిధుల నుంచి పాఠశాలకు కావాల్సిన స్టేషనరీ, మౌలిక సదుపాయాల రిపేర్‌లకు వినియోగించుకోవచ్చన్నారు.
Similar News
News October 29, 2025
అజహరుద్దీన్‌కి మంత్రి పదవి: డీకే అరుణ స్పందన

కాంగ్రెస్ నాయకుడు, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు అంటే కాంగ్రెస్ ఎంతగా భయపడుతుందో మంత్రి పదవి ఇవ్వడంతో తెలుస్తుందన్నారు. ముఖ్యంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు మంత్రివర్గ విస్తరణ చేయరాదన్న నిబంధన ఉందన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
News October 29, 2025
భువనగిరి జిల్లాలో రేపు స్కూల్స్ బంద్

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యజమానులు గమనించాలని సూచించారు.
News October 29, 2025
రేపు పాఠశాలలకు సెలవు: హనుమకొండ డీఈవో

భారీ వర్షాల దృష్ట్యా హనుమకొండ కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం జిల్లాలోని అన్ని పాఠశాలలకు డీఈవో సెలవు ప్రకటించారు. ఆ రోజు జరగాల్సిన సమ్మేటివ్ పరీక్షలు (3-10 తరగతులకు EVS, జనరల్ సైన్స్, సెకండ్ లాంగ్వేజ్) నవంబర్ 1, 2025కు వాయిదా పడినట్లు చెప్పారు. అక్టోబర్ 31 పరీక్షల్లో మార్పు లేదని పేర్కొన్నారు.


