News October 31, 2025

సంగారెడ్డి: పెండింగ్ కేసులు వెంటనే పరిష్కరించాలి: ఎస్పీ

image

సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ పారితోష్ పంకజ్ శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో పెండింగ్ లో ఉన్న కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆన్ లైన్ బెట్టింగ్, సైబర్ క్రైమ్ పై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

Similar News

News November 1, 2025

JEE మెయిన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

image

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్-2026 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. <>jeemain.nta.ac.in<<>> వెబ్‌సైట్‌లో ఈ నెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. JEE మెయిన్ రెండు సెషన్లలో జరగనుంది. ఫస్ట్ సెషన్ జనవరి 21, 30 తేదీల మధ్య, రెండో సెషన్ ఏప్రిల్ 1, 10 తేదీల మధ్య నిర్వహించనున్నట్లు NTA ప్రకటించింది. బీఈ, బీటెక్, B. Arch, B. Planning కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.

News November 1, 2025

పంటలకు ఆర్థిక సాయం పెంపు : మంత్రి కొలుసు

image

పంటలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచామని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. గతంలో ధరల స్థిరీకరణకు రూ.3వేల కోట్లు కేటాయించగా.. తాము రూ.6 వేల కోట్లకు పెంచామన్నారు. మామిడికి రూ.260 కోట్లు, పొగాకు రూ.273 కోట్లు, కోకోకు రూ.14 కోట్లు, కాఫీకి కిలోకు రూ.50 చొప్పున కేటాయించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం 40 లక్షల మెట్రిక్ టన్నులు కొంటె.. తమ ప్రభుత్వం 53.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు.

News November 1, 2025

వరంగల్ కబ్జాలపై సీఎం రేవంత్ ఉక్కుపాదం

image

వరంగల్ వరదల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులు, నాళాలపై కబ్జాలు చేసిన వారిని ఎంత పెద్దవారైనా వదలొద్దని హెచ్చరించారు. ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌లో ఇరిగేషన్ శాఖతో అన్ని విభాగాలు సమన్వయంగా పని చేయాలని ఆదేశించారు. ముంపు ప్రభావిత కుటుంబాలకు సహాయం అందించడంలో నిర్లక్ష్యం వదలాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలని ఆదేశించారు.