News February 6, 2025
సంగారెడ్డి: పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్
సంగారెడ్డి జిల్లాలో మీ సేవలో పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో, ఇరిగేషన్, రెవెన్యూ ల్యాండ్ సర్వే తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వారం రోజుల్లో మీ సేవ కేంద్రాల్లో పెండింగ్లో ఉన్న ధరణి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News February 7, 2025
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: అనకాపల్లి ఎస్పీ
సైబర్ నేరాల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా హెచ్చరించారు. గురువారం ఎస్.రాయవరం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. శాంతి భద్రతల సమస్యపై ఆరా తీశారు. గంజాయి అక్రమ రవాణా జరక్కుండా చూడాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
News February 7, 2025
సిద్దిపేట: సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి: DMHO
ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని సిద్దిపేట డీఏంహెచ్‌ఓ పాల్వన్ కుమార్ సూచించారు. గురువారం జిల్లాలోని జగదేవ్ పూర్, తీగుల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యక్రమాల పనితీరును రికార్డుల ద్వారా తెలుసుకున్నారు. తర్వాత ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్‌లలో నిర్వహిస్తున్న పరీక్ష నమూనాలను పరిశీలించారు.
News February 7, 2025
కాకినాడ నుంచి కుంభమేళకు మరో రైలు
కాకినాడ నుంచి ప్రయాగరాజ్‌కు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఫిబ్రవరి 20న కాకినాడ నుంచి ఏసీ బోగీలతో ప్రత్యేక రైలు ఏర్పాటు చేసిన విషయం విధితమే. తాజాగా కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ సూచన మేరకు ఈనెల 8న మరో అదనపు రైలు ఏర్పాటు చేశారు. ఈ రైలు కాకినాడలో 8వ తేదీ మధ్యాహ్నం 2.30కు బయలుదేరుతుందని, రెండు రోజుల తర్వాత ప్రయాగరాజ్ చేరుకుంటుందని ఎంపీ కార్యాలయం వెల్లడించింది.