News February 26, 2026
సంగారెడ్డి: పెన్షన్ పెంపు కోసం పోరాటం తప్పదు: NPRD

సంగారెడ్డి గణేష్ నగర్‌లో ఎన్‌పీఆర్‌డీ(NPRD) 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బసవరాజ్ సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య మాట్లాడుతూ.. వికలాంగుల పెన్షన్ పెంపు, బడ్జెట్‌లో నిధుల కేటాయింపు కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వికలాంగుల హక్కుల సాధనకై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
Similar News
News February 27, 2026
బ్లడ్ బాత్.. ₹5లక్షల కోట్లు ఆవిరి!

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 961 పాయింట్లు కోల్పోయి 81,287కు, నిఫ్టీ 317 పాయింట్ల నష్టంతో 25,178 వద్ద స్థిరపడింది. దాదాపు ₹5లక్షల కోట్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్‌లో ట్రెంట్, HCL, ఇన్ఫోసిస్, ఎటర్నల్ మినహా మిగతా షేర్లు అన్నీ నష్టాలతోనే ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ అస్థిరత, FII సెల్లింగ్, US-ఇరాన్ చర్చలు కొలిక్కి రాకపోవడం, రూపీ పతనం ఎఫెక్ట్ చూపించింది.
News February 27, 2026
సిరిసిల్ల: రైతు దీక్షకు తీన్మార్ మల్లన్న మద్దతు

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 12 గ్రామాల ప్రజలు ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసి తమ సమస్యలను వివరించారు. ప్రస్తుతం పెద్ద లింగాపూర్ సబ్‌స్టేషన్ ఎదుట నిరాహార దీక్ష కొనసాగిస్తున్నామని, తమ దీక్షకు మద్దతుగా రావాలని తీన్మార్ మల్లన్నను కోరారు. 4న దీక్షా శిబిరానికి స్వయంగా హాజరై రైతులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తానని అన్నారని తెలిపారు.
News February 27, 2026
ఉగాదికి లక్ష టిడ్కో ఇళ్ల పంపిణీ!

AP: ఉగాది(MAR 19) నాటికి లక్ష టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ తెలిపారు. మిగతా గృహాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకొనేందుకు లబ్ధిదారులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు. దీంతో 40,500 మందికి ₹1,345Cr ఇచ్చేందుకు సమ్మతించారు. కాగా ఈ ఏడాది జూన్ నాటికి మొత్తంగా 2.61 లక్షల ఇళ్లను పేదలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.


