News March 11, 2025
సంగారెడ్డి: పోలీసు అధికారులను హెచ్చరించిన ఎస్పీ

జిల్లాలో పోలీసు అధికారులు అంకితభావంతో పనిచేయాలని నూతన ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసులు ఉంటే వెంటనే పరిష్కరించేలా చూడాలని చెప్పారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు పాల్గొన్నారు.
Similar News
News March 11, 2025
ఆర్థికమాంద్యం ముప్పులో అమెరికా!

అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ నిబంధనలతో ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని ఇన్వెస్టర్లు భావించడంతో నాస్‌డాక్ 4 శాతం క్షీణించింది. 2022 తర్వాత ఒక్కరోజులో అతిపెద్ద నష్టం ఇదే. టెస్లా, Nvidia, మెటా, అమెజాన్, ఆల్ఫాబెట్ షేర్లు భారీగా నష్టపోయాయి. 1.9 ట్రిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. ఈ ఏడాది అమెరికాలో ఆర్థికమాంద్యం వచ్చే అవకాశాలు 40%కి పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
News March 11, 2025
గుంటూరులో వ్యక్తి కిడ్నాప్

లాడ్జిలో వివాహితతో కలిసి ఉన్న ఓ వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసి అతణ్ని కిడ్నాప్ చేశారు. లాడ్జి మేనేజర్ తిరుపతి ఫిర్యాదు మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లా లాలాపేట పోలీసులు కేసు నమోదు చేశామన్నారు. పోలీసుల కథనం.. జిన్నాటవర్ సెంటర్లోని బాలాజీ లాడ్జిలో రామలింగేశ్వరరావు అనే వ్యక్తి ఓ వివాహితతో రూమ్ తీసుకున్నాడు. నలుగురు వ్యక్తులు వచ్చి అతడిపై దాడి చేసి అతణ్ని తీసుకెళ్లారని తెలిపారు.
News March 11, 2025
నిర్మల్ జిల్లాలో పలువురు CIల బదిలీలు

నిర్మల్ జిల్లాలో పలువురు CIలను రాష్ట్ర పోలీసు అధికారులు బదిలీ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేశారు. డీసీఆర్‌బీలో CIగా విధులు నిర్వహిస్తున్న ప్రేమ్ కుమార్‌ను డీఎస్‌బీకి బదిలీ చేశారు. సీసీఎస్ విభాగంలో CIగా విధులు నిర్వహిస్తున్న కృష్ణను నిర్మల్ రూరల్ CIగా, హైదరాబాద్‌లో వెయిటింగ్ లిస్టులో ఉన్న సమ్మయ్యను డీసీఆర్‌బీ నిర్మల్‌కు బదిలీ చేశారు.