News August 18, 2025
సంగారెడ్డి: పోలీస్ ప్రజావాణికి 12 దరఖాస్తులు

సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద ఎస్పీ పరితోష్ పంకజ్ వినతిపత్రాలు స్వీకరించారు. మొత్తం 12 మంది తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ఐలకు ఫోన్‌లో ఎస్పీ ఆదేశించారు.
Similar News
News August 19, 2025
PDPL: కష్టపడి శ్రమిస్తేనే లక్ష్యాల చేరిక: DCP

రామగిరి మం. JNTU ఇంజినీరింగ్ కళాశాలలో నూతన విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. కేశోరాం ప్లాంట్ అధిపతి శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథిగా, PDPL DCP కరుణాకర్, ACP రమేష్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థులు బాధ్యతతో చదువుకుని నైపుణ్యాలు పెంపొందించుకోవాలని శ్రీనివాసరెడ్డి సూచించగా, DCP కరుణాకర్ కష్టపడి శ్రమిస్తేనే లక్ష్యాలు చేరుకోగలరన్నారు. క్రీడల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు.
News August 19, 2025
TODAY HEADLINES

★ ప్రధాని మోదీతో శుభాంశు శుక్లా భేటీ
★ తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదులు
★ తప్పుడు ప్రచారాలతో వైసీపీ గందరగోళం సృష్టిస్తోంది: CM చంద్రబాబు
★ కేసీఆర్ వల్లే బీసీ రిజర్వేషన్లు ఆగాయి: CM రేవంత్
★ కేంద్ర ఎన్నికల సంఘంపై ప్రతిపక్షాల ఫైర్
★ కోట శ్రీనివాస్ రావు భార్య కన్నుమూత
★ భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
News August 19, 2025
పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలి: కరీంనగర్ కలెక్టర్

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కరీంనగర్ శిశు గృహాల్లో పెరుగుతున్న 3 ఏళ్ల పాపను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా USAకు చెందిన దంపతులకు దత్తత ఇచ్చారు. వీరికి ఇది వరకే బాబు జన్మించగా ఆడశిశువు దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం విచారించి ఆడ శిశువును కలెక్టర్ సోమవారం దత్తత ఇచ్చారు. పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.