News September 11, 2025

సంగారెడ్డి: పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

సంగారెడ్డి జిల్లాలోని వివిధ కేజీబీవీ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఎఎన్ఎం, అకౌంటెట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విధాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ఈ ఖాళీగా ఉన్న పోస్టులకు మహిళ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఈ దరఖాస్తులను ఈనెల 15వ తేదీ లోగ జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

Similar News

News September 11, 2025

ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ గ్రౌండ్ బకాయిల వివరాలు

image

ప్రొద్దుటూరు మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేలంపై కౌన్సిల్ సమావేశంలో 24 గంటలు ఉత్కంఠత అనంతరం ఆమోదం తెలిపారు. 9 ఏళ్లుగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు మున్సిపాలిటీకి బకాయిలు పెడుతూనే ఉన్నారు. వాటి వివరాలు (లక్షలలో)..
2015లో రూ.3.96, 2016లో రూ.3.13, 2017లో రూ.2, 2018లో రూ.4.75, 2019లో రూ.8.02, 2021లో రూ.7.10, 2022లో రూ.30.06, 2023లో రూ.5.66, 2024లో రూ.31.50 బకాయిలు మున్సిపాలిటీకి రావాల్సి ఉంది.

News September 11, 2025

ADB: వాగు దాటి.. వైద్యం చేసి

image

బాధిత గ్రామాల ప్రజలకు సేవ చేయడానికి వైద్య సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారు. బజార్‌హత్నూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడానికి వైద్య సిబ్బంది పడ్డ కష్టాలు చూస్తే వారి అంకితభావం అర్థమవుతుంది. గ్రామానికి అడ్డుగా ప్రవహిస్తున్న వాగును తంటాలు పడుతూ దాటి, నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన మందులు పంపిణీ చేశారు.

News September 11, 2025

పాలమూరు: 5,579 TOSS అడ్మిషన్లు

image

పాలమూరు వ్యాప్తంగా ఈ ఏడాదికి గాను ఓపెన్ SSC, INTER ప్రవేశాల్లో మొత్తం 5,579 మంది అడ్మిషన్లు పొందారని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య Way2Newsతో తెలిపారు. జిల్లాల వారీగా..
✒MBNR: 715(SSC), 1120(INTER)
✒NGKL: 310(SSC), 748(INTER)
✒GDWL: 331(SSC), 520(INTER)
✒WNPT: 247(SSC), 533(INTER)
✒NRPT: 410(SSC), 650(INTER)
ఆసక్తిగలవారు రేపటిలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.