News February 4, 2025
సంగారెడ్డి: ప్రజావాణికి 63 ఫిర్యాదులు

సంగారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 63 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. వారితో పాటు డీఆర్వో పద్మజారాణి, ఆర్డీవో రవీందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
Similar News
News March 6, 2026
బెంబేలెత్తించిన బెథెల్

T20WC: సెమీఫైనల్లో భారత్ గెలిచినా ఇంగ్లండ్ బ్యాటర్ బెథెల్ మనసులు గెలిచారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా తన దూకుడును ఎక్కడా తగ్గించలేదు. వరుసగా సిక్సర్లు, ఫోర్లు కొడుతూ భారత ఆటగాళ్లను, అభిమానులను వణికించారు. 48 బంతుల్లోనే 7 సిక్సర్లు, 8 ఫోర్లతో 105 రన్స్ చేశారు. బెథెల్ గ్రేట్ ఇన్నింగ్స్ ఆడారంటూ టీమ్ ఇండియా ఫ్యాన్స్ సైతం ప్రశంసిస్తున్నారు.
News March 6, 2026
తెలంగాణకు కొత్త గవర్నర్

కేంద్రం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించింది. తెలంగాణకు శివ ప్రతాప్ శుక్లాను అపాయింట్ చేసింది. ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నారు. ఇక TG గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసింది. నాగాలాండ్ గవర్నర్‌గా నంద్ కిశోర్ యాదవ్, బిహార్ గవర్నర్‌గా సయ్యద్ హస్నేన్, బెంగాల్ గవర్నర్‌గా R.N. రవిని నియమించింది.
News March 6, 2026
చంద్రగిరి: మరో MBU విద్యార్థి సూసైడ్

చంద్రగిరి మోహన్ బాబు యునివర్సిటీ(MBU)లోని బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి హర్షవర్ధన్ రెడ్డి రామిరెడ్డిపల్లిలోని ఒక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు కడప జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.


