News February 11, 2025

సంగారెడ్డి: ప్రతిభ పోటీలను సద్వినియోగం చేసుకోవాలి: DEO

image

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సైన్స్ మ్యూజియంలో నిర్వహించిన జిల్లా స్థాయిలో నిర్వహించిన భౌతిక రసాయన శాస్త్రం ప్రతిభ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం డిఈవో మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతిభ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Similar News

News April 5, 2026

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు: కలెక్టర్

image

అనంతపురంలోని కలెక్టరేట్‌లో సోమవారం జరుగునున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 6న సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు.

News April 5, 2026

మెండోర: సెల్‌ఫోన్ కొనివ్వలేదని యువకుడి సూసైడ్

image

మెండోర మండలం సోన్ పేట్‌కు చెందిన పిండి మధు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. తల్లిదండ్రులు సెల్‌ఫోన్ కొనివ్వలేదని మనస్తాపానికి గురై గడ్డిమందు తాగాడు. నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. అతని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుహాసిని తెలిపారు.

News April 5, 2026

విశాఖ: తొమ్మిదేళ్లలో మూడుసార్లు వార్డులు పెంపు(2/2)

image

రాష్ట్రంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన జీవీఎంసీలో గత తొమ్మిదేళ్లలో వార్డుల సంఖ్య పెంపు మూడోసారి చేపడుతున్నారు. 2017కి ముందు 72 వార్డులు ఉండగా, 2017లో 81కు, 2020లో పరిసర గ్రామాల విలీనంతో 98కు పెరిగాయి. ప్రస్తుతం 98 నుంచి 120కు పైగా పెంచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం ముందుగా 8 జోన్లుగా ఉన్న జీవీఎంసీని ఇప్పటికే 10 జోన్లుగా విభజించారు.