News December 23, 2025
సంగారెడ్డి: ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు జరగాలి: ఎస్పీ

ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేసి బాధితులకు అండగా నిలవాలని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో క్రైమ్ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.
Similar News
News December 27, 2025
న్యూఇయర్‌కి ఫ్యామిలీతో ఉంటారా.. జైల్లో ఉంటారా: సజ్జనార్

TG: జనవరి 1 వరకు స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ కొనసాగుతుందని హైదరాబాద్ CP సజ్జనార్ పేర్కొన్నారు. 2025 వార్షిక నేర నివేదిక విడుదల సందర్భంగా పౌరులను హెచ్చరించారు. ‘మద్యం తాగి పట్టుబడితే జైల్లో వేయటం ఖాయం. HYD మొత్తం ఇప్పటికే న్యూ ఇయర్ డ్రంకెన్ డ్రైవ్ నడుస్తోంది. ఈ ఏడాది నగరంలో నేరాలు 15% తగ్గాయి. పోక్సో కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. 368 కేసుల్లో రూ.6.45 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశాం’ అని తెలిపారు.
News December 27, 2025
కడప: ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్లకు నోటీసులు.!

జిల్లాలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఫేజ్ -3 ఇళ్ల నిర్మాణాలను గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు ఇచ్చారు. వారు లబ్ధిదారుల నుంచి, ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకుని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా వదిలేశారు. దీనిపై అధికారులు పరిశీలన జరిపి సంబంధిత సిబ్బందికి జీతాలు నిలిపేయాలని ఆదేశాలు ఇచ్చారు. వ్యతిరేకత రావడంతో కాంట్రాక్టర్లకు నోటీసులిచ్చారు.
News December 27, 2025
కరీంనగర్ కమిషనరేట్లో తగ్గిన క్రైమ్ రేట్

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 16.84% క్రైమ్ రేట్ తగ్గినట్లు క్రైమ్ యాన్యువల్ రిపోర్ట్ స్పష్టం చేస్తుంది. 2024లో 7,361 కేసులు నమోదు కాగా.. 2025 సంవత్సరంలో 6421 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 80% పైగా కేసులు పరిష్కారమయ్యాయి. దీంతో కరీంనగర్లో పోలీస్ వ్యవస్థ పకడ్బందీగా అమలవుతున్నట్టు స్పష్టమవుతుంది.


