News April 14, 2025

సంగారెడ్డి: ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానం

image

మైనార్టీ గురుకుల పాఠశాలలలో ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ అధికారి దేవుజ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి, ఆరవ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లకు, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం www.tmreis.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు సమీపంలోని మైనార్టీ పాఠశాలలో సంప్రదించాలని సూచించారు.

Similar News

News April 15, 2025

చిన్నారుల అక్రమ రవాణాపై సుప్రీంకోర్టు ఆగ్రహం

image

చిన్నారుల అక్రమ రవాణా విషయంలో UP ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు గైడ్‌లైన్స్ నిర్దేశించింది. ఆసుపత్రుల నుంచి నవజాత శిశువులు మిస్సయితే వాటి లైసెన్స్‌లు రద్దు చేయాలని ఆదేశించింది. అక్రమ రవాణా కేసుల ట్రయల్స్‌ను కోర్టులు 6 నెలల్లోగా పూర్తి చేయాలంది. కాగా 2020 నుంచి 36 వేల మంది చిన్నారులు మిస్ అయ్యారని కేంద్రం గత ఫిబ్రవరిలో కోర్టుకు నివేదిక సమర్పించింది.

News April 15, 2025

చిత్తూరు: కిలో 7 రూపాయలే..!

image

మామిడి సాగుకు చిత్తూరు జిల్లా పెట్టింది పేరు. ఇక్కడ అన్ని రకాల మామిడి పండుతుంది. కానీ రైతులకు ఏటా నష్టాలు తప్పడం లేదు. ఓవైపు పూత, దిగుబడి సమస్య వేధిస్తుంటే.. మరోవైపు అకాల వర్షాలు, ఈదురుగాలులు రైతును కకావికలం చేస్తున్నాయి. నిన్న జిల్లాలో వీచిన గాలులకు మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. వాటిని మండీలకు తరలిస్తే కేజీకి రూ.7 నుంచి రూ.10 మించి ధర లభించలేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

News April 15, 2025

మల్కాపురం: బాలికతో అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు

image

మల్కాపురం పోలీస్ స్టేషన్‌‌లో మంగళవారం పోక్సో కేసు నమోదైంది. సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ.. మల్కాపురంలో అంగ కృష్ణ ఇంట్లో ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. వారికి 11 ఏళ్ల బాలిక ఉంది. సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి యజమాని బాలికతో అసభ్యకరంగా ప్రవరించాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో మంగళవారం పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.

error: Content is protected !!