News April 2, 2025
సంగారెడ్డి: ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు

సంగారెడ్డి జిల్లాలోని 122 పరీక్ష కేంద్రాల్లో మార్చి 21 నుంచి నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నేటితో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ జిల్లాలో 22,412 మంది విద్యార్థులకు గానూ 22,371 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని పేర్కొన్నారు.
Similar News
News January 3, 2026
పిచ్చండి.. పిచ్చి.. కర్రలు కాలే వీడియోకు 15.6 కోట్ల వ్యూస్

కొన్ని యూట్యూబ్ వీడియోలకు మ్యాటర్ లేకున్నా బోలెడు వ్యూస్ వస్తాయి. అలాంటిదే ఈ వీడియో. ఓ వ్యక్తి కర్రలు కాలుతున్న HD వీడియోను 9 ఏళ్ల క్రితం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. 10 గంటల నిడివి ఉన్న ఆ వీడియోకు ఇప్పటివరకు ఏకంగా 156 మిలియన్ల (15.6 కోట్లు) వ్యూస్ రావడం విశేషం. క్వాలిటీ వీడియో, కర్రలు మండే సహజ శబ్దం వల్ల చాలా మంది ప్రశాంతంగా నిద్రపోయేందుకు చూసి ఉంటారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
News January 3, 2026
భారీ ఎన్‌కౌంటర్.. 14 మంది మావోలు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. వేర్వేరు ఘటనల్లో మొత్తం 14 మంది మావోయిస్టులు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. కొంటా-కిస్తారామ్ అడవుల్లో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 12 మంది, బీజాపూర్ జిల్లాలో ఇద్దరు మావోలను పోలీసు బలగాలు హతమార్చాయి. వీరిలో కీలక నేత సచిన్ మంగడు కూడా ఉన్నారు. దీంతో కొంటా ఏరియా కమిటీ పూర్తిగా హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. అడవుల్లో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
News January 3, 2026
BREAKING: సిద్దిపేట: స్కూల్‌లో విద్యార్థిని అనుమానాస్పద మృతి

సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి-ఎల్లుపల్లి కస్తూర్భా గాంధీ స్కూల్‌లో 7వ తరగతి విద్యార్థిని హర్షిణి అనుమానాస్పదంగా మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. రాత్రి హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి ఆమెను తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు చెప్పారు. అనంతరం సిద్దిపేట ప్రభుత్వ మార్చురీకి మృతదేహాన్ని తరలించామన్నారు. బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన హర్షిణిగా గుర్తించారు.


