News February 3, 2025

సంగారెడ్డి: ప్రారంభమైన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రాం సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

Similar News

News December 24, 2025

తిరుపతిలో స్కాం.. AEO సూసైడ్‌పై చర్చ

image

తిరుపతి గోవిందరాజ స్వామివారి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో <<18647016>>స్కాం <<>>జరిగిందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. నాటి AEOపై క్రమశిక్షణా రాహిత్యం కేసు ఎందుకు నమోదైంది? రిటైరయ్యే కొన్ని రోజుల ముందే ఆయన సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది. ఆయన రిటైర్మెంట్ ముందు కూడా ఆ కేసు ఎందుకు క్లియర్ కాలేదనేది నేటికి ప్రశ్నగా మిగిలింది.

News December 24, 2025

KNR: ఈ నెల 25 నుంచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

image

స్థానిక అంబేడ్కర్ హాకీ స్టేడియంలో ఈ నెల 25 నుంచి 28 వరకు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు జరగనున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం చీఫ్ పాటర్న్ ప్రసాదరావు వెల్లడించారు. నేడు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషుల, మహిళల కబడ్డీ పోటీలకు 33 జిల్లాల నుంచి క్రీడాకారులు రానున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

News December 24, 2025

పాన్-ఆధార్ లింక్ చేశారా? DEC 31 వరకే గడువు

image

పాన్-ఆధార్ లింక్ చేసుకునేందుకు గడువు DEC 31తో ముగియనుంది. ఆలోగా లింక్ చేయకపోతే పాన్ రద్దవుతుంది. లింక్ చేసేందుకు IT ఈ-ఫైలింగ్ <>పోర్టల్‌కి<<>> వెళ్లి ‘లింక్ ఆధార్’ క్లిక్ చేసి వివరాలు, OTP ఎంటర్ చేయాలి. ఫీజు పే చేశాక మళ్లీ ‘లింక్ ఆధార్’లో డీటెయిల్స్, OTP వెరిఫై చేస్తే పాన్, ఆధార్ లింక్ అవుతాయి. కాగా డీయాక్టివేట్ అయిన 2017 జులైకి ముందు PANను యాక్టివ్ చేసుకోవాలంటే రూ.1000 ఫైన్ చెల్లించాలి.