News November 26, 2025
సంగారెడ్డి: ప్రీ ప్రైమరీ పాఠశాలలకు ఇన్‌స్ట్రక్టర్లు

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో బోధించడానికి ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలను నియమిస్తూ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 59 ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇన్‌స్ట్రక్టర్లకు నెలకు రూ.8,000, ఆయాలకు రూ.6,000 వేతనం చెల్లించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Similar News
News November 29, 2025
TODAY HEADLINES

➢ గోవాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన(77 ఫీట్) రాముని విగ్రహాన్ని ఆవిష్కరించిన పీఎం మోదీ
➢ జనవరి 1న అందరం లొంగిపోతాం: మావోయిస్టు పార్టీ
➢ 2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి: CM CBN
➢ అమరావతిలో 15 బ్యాంకులకు ఒకేసారి శంకుస్థాపన
➢ దూసుకొస్తున్న ‘దిత్వా’ తుఫాన్.. కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన
➢ TGలో పంచాయతీ ఎన్నికలపై స్టేకు హైకోర్టు నిరాకరణ
➢ కాళేశ్వరంతో ఒక్క ఎకరానికీ నీళ్లు రాలేదు: కవిత
News November 29, 2025
మావోయిస్ట్ కీలక నేత అనంత్ అస్త్ర సన్యాసం

మావోయిస్టు పార్టీ కీలక నేతల లొంగుబాటు పర్వం కొనసాగుతోంది. తాజాగా మహారాష్ట్ర – మధ్యప్రదేశ్ – ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. మొత్తం 15 మంది నక్సల్స్ అస్త్ర సన్యాసం తీసుకున్నారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. జనవరి 1న సాయుధ విరమణ చేస్తున్నట్టు నిన్న లేఖ విడుదల చేసిన అనంత్ అంతలోనే లొంగిపోవడం గమనార్హం.
News November 29, 2025
జగిత్యాల: ‘ఉద్యోగులకు టీఎన్జీవో అండగా ఉంటుంది’

రాష్ట్రంలోని ఉద్యోగులకు టీఎన్జీవో సంఘం అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షులు నాగేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మెట్‌పల్లి యూనిట్ శాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల ప్రధాన సమస్యలైన సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయడం, పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) అంశాలపై సంఘంలో చర్చించారు.


