News January 19, 2026
సంగారెడ్డి: ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల

జిల్లాలోని 5 నుంచి 10 వ తరగతి వరకు చదువుతున్న ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఫ్రీ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తులను http://telanganaepass.cgg.gov.inలో ఈనెల 31 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News February 14, 2026
అనకాపల్లి జేసీగా సౌర్య మాన్ పటేల్ బాధ్యతలు

అనకాపల్లి జిల్లా సంయుక్త కలెక్టర్‌గా శౌర్యమాన్ పటేల్ శనివారం రాత్రి విధుల్లో చేరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించి, తొలి సంతకం చేశారు. ఆయన ఇంతవరకు అమరావతి కేంద్రంగా ఉన్న ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేశారు. బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్నారు.
News February 14, 2026
మెదక్: రేపు 11లోపు Form-A సమర్పించాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ అధికార ప్రతినిధిత్వానికి సంబంధించి Form-Aని రేపు ఉ.11 గంటలలోగా సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. అలాగే Form-Bని ఎన్నిక రోజు ఉ.10 గంటల వరకు అందజేయాలని సూచించారు. గడువులోపు మార్పులకు అవకాశం ఉంటుందని, ఎన్నికల సమావేశం చెల్లుబాటు కావాలంటే కనీసం 50 శాతం సభ్యుల హాజరు తప్పనిసరని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన కోరారు.
News February 14, 2026
సింగరాయకొండ శ్రీ చైతన్యలో విద్యార్థి మృతి

సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ స్కూల్‌లో ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి హాస్టల్లోని బాత్రూంలో అపస్మారక స్థితిలో పడి ఉండడంతో గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి తెలియజేశారు. వెంటనే విద్యార్థిని హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


