News February 20, 2025
సంగారెడ్డి: ప్రొఫెసర్ సూసైడ్

మునిపల్లి మండలంలోని కంకోల్ గ్రామ శివారులో గల వాక్సిన్ యూనివర్సిటీలో డిజైనర్ ప్రొఫెసర్ సుమంత్ కుమార్ (36) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూనివర్సిటీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేశారు. డెడ్ బాడీని సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 17, 2026
మల్కాజిగిరి: 74 వార్డుల ‘మాస్’ అడ్డా.. తూర్పున కమలం జోరు!

ఈస్ట్ HYDలోని 74 వార్డులతో ఏర్పడిన మల్కాజిగిరి కార్పొరేషన్ (MMC) ఇప్పుడు అతిపెద్ద పొలిటికల్ గ్రౌండ్. ఉప్పల్, ఎల్బీనగర్‌లో బీజేపీకి ఉన్న బలమైన ‘హిందూ-మాస్’ ఓటు బ్యాంకును కాంగ్రెస్ తన సంక్షేమ పథకాలతో ఢీకొట్టాలనుకుంటుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రకారం.. ఇక్కడ BJP-INC మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోరు సాగబోతోందా? BRS మూడో స్థానానికి పడిపోగా! తూర్పున జెండా పాతేందుకు BJP తన శక్తినంతా ఒడ్డాల్సి ఉంది.

NZB: ‘తప్పిదాలకు తావులేకుండా నిర్ణీత గడువులోగా మ్యాపింగ్ ప్రక్రియ’

తప్పిదాలకు తావులేకుండా నిర్ణీత గడువులోగా మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేసేలా రోజువారీగా పర్యవేక్షణ చేయాలని CEO సుదర్శన్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ, ఇతర అంశాలపై సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.