News January 10, 2026

సంగారెడ్డి: ఫిజికల్ ఫిట్నెస్ కాపాడుకోవాలి: ఎస్పీ

image

పోలీసులకు ఫిజికల్ ఫిట్నెస్ ఎంతో ముఖ్యమని, శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలని ఎస్పీ పారితోష్ పంకజ్ సూచించారు. ఆర్ముడ్ రిజర్వ్ పోలీసులకు ఆర్ఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్స్ శనివారం వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సమర్ధవంతంగా విధులను నిర్వహించాలన్నారు. ప్రతి రోజు యోగా, వ్యాయామం చేస్తూ ఫిజికల్ ఫిట్నెస్‌ను కాపాడుకోవాలన్నారు.

Similar News

News February 9, 2026

రావులపాలెం: టీ తాగడానికి వెళ్తే మృత్యువు కబళించింది

image

రావులపాలెం మండలం ఊబలంకలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బండారు వెరయ్య (79) మృతి చెందాడు. టీ తాగడానికి వచ్చిన వృద్ధుడిని రావులపాలెం నుంచి ఆత్రేయపురం వెళ్తున్న లారీ అతివేగంగా ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. మృతుని కుమారుడు బండారు వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI కేవీ రమణారెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News February 9, 2026

విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి: కలెక్టర్

image

హన్మకొండ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్‌లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్యను కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నివేదిక అందజేయాలని సూచించారు. టెన్త్ విద్యార్థులకు పరీక్షల సమయం దగ్గరపడుతోందని ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణిస్తారని చెప్పారు.

News February 9, 2026

VZM: పీజీఆర్ఎస్‌లో వింత అర్జీ

image

నెల్లిమర్ల సామాజిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవలు ఎంతో బాగున్నాయని గుర్ల మండలం కెల్ల గ్రామానికి చెందిన కర్రోతు పైడినాయుడు పీజీఆర్‌ఎస్‌లో అర్జీ ద్వారా అభినందించారు. ఆయన భార్యకు సాధారణ కాన్పు చేసి తల్లీ, బిడ్డల ప్రాణాలు కాపాడిన డాక్టర్ తిరుమలదేవి, సిబ్బంది సేవలను ప్రశంసించారు. సాధారణంగా సమస్యలపై వినతులు రావడం పరిపాటి. ప్రభుత్వ సేవలను ప్రశంసిస్తూ అర్జీ రావడం ఆశ్చర్యానికి గురిచేసింది.