News January 31, 2025
సంగారెడ్డి: ఫిబ్రవరి 1 నుంచి పోలీస్ యాక్ట్

ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు సంగారెడ్డి జిల్లాలో పోలీస్ చట్టం అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ రూపేష్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించకూడదని సూచించారు. అనుమతి లేకుండా ఎవరైనా కార్యక్రమాలు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News July 5, 2025
రణస్థలం: ఏడో తరగతి బాలికపై అత్యాచారయత్నం

రణస్థలం ప్రాంతానికి చెందిన పిన్నింటి చంద్రశేఖర్ (26) డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ విశాఖలోని రేసపువానిపాలెం వినాయకనగర్ వద్ద నివాసం ఉంటున్నాడు. తన ఇంటి కింద నివసిస్తున్న ఏడో తరగతి చదువుతున్న బాలికను శుక్రవారం తన గదికి రప్పించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కి తరలించారు.
News July 5, 2025
హత్యాయత్నం కేసు.. నిందితులకు 5 ఏళ్ల కఠిన కారాగారం

పెగడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్యాయత్నం కేసులో జగిత్యాల అసిస్టెంట్ సెషన్స్ న్యాయమూర్తి వెంకటమల్లిక్ నిందితులైన తోట నారాయణ (32), తోట మారుతి (35), ఆయన భార్య తోట జ్యోతికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.1500/- చొప్పున జరిమానా విధించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. నేరస్థులు చట్టం నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.
News July 5, 2025
HYD: ‘వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’

వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వీ కర్ణన్ అన్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.