News March 2, 2025
సంగారెడ్డి: బాలింత మృతితోఆందోళన.. కేసు నమోదు.!

వైద్యుల నిర్లక్ష్యంతో <<15621244>>బాలింత మృతి<<>> చెందిందని బాధిత కుటుంబీకులు ఆందోళన చేశారని సంగారెడ్డి ఎస్‌ఐ పి.రవీందర్ అన్నారు. ఎస్‌ఐ వివరాలు.. కోహీర్ మండలం మద్రికి చెందిన గర్భిణీ మహానందిని ప్రసవానికి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రసవంలో ఆడ శిశువు పుట్టగా, బాలింత మృతి చెందింది. భర్త నవీన్, కుటుంబీకులు కన్నీళ్ల పర్యంతమై ఆస్పత్రిలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 11, 2025
అధిక పాలిచ్చే పశువును ఎలా గుర్తించాలి?(1/2

పాడి ద్వారా ఎక్కువ ఆదాయం రావాలంటే మనం కొనే పశువు ప్రతి 14 నుంచి 15 నెలలకు ఒకసారి ఈనేట్లు ఉండాలి. పాడి పశువు పాలసార గురించి తెలుసుకోవాలంటే ఆ పశువు పొదుగును గమనించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు. పొదుగు పెద్దదిగా ఉండి, శరీరంలో కలిసినట్లుగా ఉండాలి. అలాకాకుండా పొదుగు వేళ్లాడుతూ, జారిపోతున్నట్లుగా ఉండకూడదు. నాలుగు పాలసిరల (చనుమొనలు) అమరిక చతురస్రాకారంగా ఉండి, అన్నింటి నుంచి పాలు సులువుగా వస్తుండాలి.
News November 11, 2025
అధిక పాలిచ్చే పాడి పశువును ఎలా గుర్తించాలి?(2/2)

పాడి పశువు నుంచి పాలు పిండిన తర్వాత పొదుగు ఒక రబ్బరు బుడగ గాలి తీసివేస్తే ఎలా అవుతుందో అలా అయిపోవాలి. అలా అవ్వని పొదుగును కండపొదుగు అంటారు. ఇది అధిక పాల దిగుబడికి పనికిరాదు. అంతేకాక పొదుగు మీద కనపడే రక్తనాళాలను గమనించాలి. వీటిని పాల సిరలు అంటారు. ఇవి పెద్దవిగా, ఎక్కువ పొడవుగా ఉండాలి. అలా ఉంటే పొదుగుకు అధిక రక్త సరఫరా జరిగి, పాల దిగుబడి పెరుగుతుంది. పొదుగు మీద చర్మం కూడా పలుచగా ఉండాలి.
News November 11, 2025
తుఫాను సాయంగా ₹2622 కోట్లు ఇవ్వాలి: AP

AP: మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం CM CBNతో భేటీ అయింది. రాష్ట్రం ప్రభుత్వం అందించిన నివేదికలపై చర్చించింది. ₹5267 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్న ప్రభుత్వం తక్షణ సాయంగా ₹2622 కోట్లు ఇవ్వాలని నివేదించింది. తుఫాను సమయంలో 22 జిల్లాల్లో 1.92 లక్షల మందికి రిలీఫ్ క్యాంపుల్లో ఆశ్రయం కల్పించామని వివరించింది. 3.36 లక్షల కుటుంబాలకు రూ.3 వేల చొప్పున అందించినట్టు తెలిపింది.


