News October 29, 2025
సంగారెడ్డి: బిడ్డపై తండ్రి ప్రేమ అంటే ఇదే..!

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం AEO శ్వేత రెండు కిడ్నీలు ఫెయిలై HYD కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆమె తండ్రి బిరాదర్ శ్యామ్‌రావు తన ఒక కిడ్నీని కూతురికి దానమిచ్చి ప్రాణం పోశారు. వీరి ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శ్వేతకు ICU నుంచి జనరల్ వార్డులోకి షిఫ్ట్ చేశారని ఆమె తల్లి ఉమారాణి తెలిపారు. ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సభ్యుడు నాగేశ్ వారికి ధైర్యాన్నిచ్చారు.
Similar News
News October 29, 2025
వికారాబాద్: నేడు జరగాల్సిన పరీక్ష నవంబర్ 1కి వాయిదా

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా మొంథా తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నేడు జరగాల్సిన ఎస్ఏ-1 పరీక్ష నవంబరు ఒకటికి వాయిదా వేశామని డీఈవో రేణుకాదేవి ప్రకటించారు. పరీక్ష వాయిదా విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలని ఆదేశించారు. పాఠశాలకు సెలవు ప్రకటించడంతో విద్యార్థులు తిరిగి ఇంటికి చేరుకుంటున్నారు.
News October 29, 2025
ఎయిమ్స్ మదురైలో 84 పోస్టులు

<
News October 29, 2025
రంగు చెప్పే ఆరోగ్య రహస్యం!

జీవనశైలి కారణంగా సంతానలేమి సమస్య పెరుగుతోంది. ఈక్రమంలో పురుషులు తమ ఆరోగ్య సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వీర్యం రంగును చెక్ చేసుకోవాలంటున్నారు. ఆకుపచ్చ రంగు ఇన్‌ఫెక్షన్ (STIs కూడా)కు సూచన కావొచ్చు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పసుపు రంగు యూరిన్ కలవడం లేదా సప్లిమెంట్ల ప్రభావమై ఉండొచ్చు. రెడ్ కలర్ రక్తానికి సంకేతం (వైద్య పరీక్ష అవసరం). తెలుపు/బూడిద రంగు హెల్తీ.


