News July 8, 2024
సంగారెడ్డి: బీజేపీ గేమ్‌లో కేసీఆర్ 4వ స్తంభం: జగ్గారెడ్డి

బీజేపీ గేమ్‌లో కేసీఆర్ నాలుగవ స్తంభమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ తెలివిగా గేమ్ మొదలు పెట్టిందని, మొదట టీడీపీని దింపి, సపోర్ట్‌గా జనసేనతో ముందుకు వెళ్లనుందన్నారు. వీరికి బీఆర్ఎస్ జత కలిసే అవకాశం ఉందన్నారు. విభజన సమస్యల పేరిట చంద్రబాబు తెలంగాణలో చాలా తెలివిగా అడుగు పెట్టారని దుయ్యబట్టారు.
Similar News
News February 26, 2026
మెదక్ కలెక్టర్‌గా ప్రతిమా సింగ్

మెదక్ జిల్లాకు నూతన కలెక్టర్‌గా ప్రతిమ సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కలెక్టర్‌గా ఉన్న రాహుల్ రాజ్‌ను సహకార శాఖకు బదిలీ చేశారు. ప్రతిమా సింగ్ ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. కలెక్టర్‌గా పదోన్నతితో మెదక్ జిల్లాకు బదిలీ అయ్యారు. ప్రతిమా సింగ్ గతంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.
News February 26, 2026
BREAKING: మెదక్ కలెక్టర్ బదిలీ

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ బదిలీ అయ్యారు. సహకార శాఖ ప్రత్యేక కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ రాజ్ 2024 మార్చి 6న ఆదిలాబాద్ నుంచి మెదక్ కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు. మెదక్ కలెక్టర్‌గా రంగారెడ్డి (లోకల్ బాడీస్) అదనపు కలెక్టర్ 2019 బ్యాచ్‌కు చెందిన ప్రతీమ సింగ్ IAS నియమితులయ్యారు.
News February 26, 2026
టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి: కలెక్టర్

పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన.. పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని సూచించారు. అనంతరం పాఠశాల రికార్డులను తనిఖీ చేసి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నజీరుద్దీన్ పాల్గొన్నారు.


