News February 11, 2025

సంగారెడ్డి: బీసీ స్టడీ సర్కిల్‌లో 12 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

బీసీ స్టడీ సర్కిల్‌లో ఆర్ఆర్ బీ, ఎస్ఎస్సీ, ఉచిత శిక్షణ కోసం 181 మంది దరఖాస్తు చేసుకున్నారని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ మంగళవారం తెలిపారు. వీరిలో ఇంటర్, డిగ్రీలో మెరిట్ ఆధారంగా 100 మందిని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. 12 నుంచి 14వ తేదీ వరకు స్టడీ సర్కిల్‌లో సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలని చెప్పారు. 15 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. SHARE IT..

Similar News

News November 5, 2025

విశాఖ: శ్మశానం వద్ద ఉరి వేసుకుని యువకుడి మృతి

image

మధురవాడలోని చంద్రంపాలెం గ్రామంలో శ్మశానం వద్ద ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉరి వేసుకొని ఉన్న యువకుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు గేదెల ఫణి (18)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News November 5, 2025

మిరపలో కుకుంబర్ మొజాయిక్ తెగులను ఎలా నివారించాలి?

image

మిరప పంటను ఆశించే ఈ వైరస్ తెగులు పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. మొక్కలు పొట్టిగా కనిపిస్తాయి. ఆకులు రంగుమారిపోతాయి. మొక్కలకు పూత ఉండదు. ఈ వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. వ్యాధిని వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25mlను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

News November 5, 2025

‘గచ్చిబౌలి దివాకర్‌’లా నారా లోకేశ్‌: YCP

image

AP: మంత్రి లోకేశ్‌పై YCP సెటైర్లు వేసింది. ‘4 గంటల్లో 4 వేల మంది అర్జీలు వినగలమా? గంటకు వెయ్యి అర్జీలేంటో తెలుసుకోవడం సాధ్యమేనా? మరీ ఇంత జాకీలా? మహా అయితే గంటకు 40 మందివి వినగలం. అలాంటిది లోకేశ్ 4 గంటల్లో 4 వేల మంది అర్జీలు తీసుకుని, విన్నట్టుగా ఈ ఎలివేషన్లు చూస్తుంటే ‘గచ్చిబౌలి దివాకర్‌’ గుర్తుకువస్తున్నాడు’ అని ట్వీట్ చేసింది.