News February 17, 2026

సంగారెడ్డి: ‘బెస్ట్ అవైలబుల్ కోసం దరఖాస్తు చేసుకోవాలి’

image

బెస్ట్ అవైలబుల్ స్కీం కింద ప్రైవేట్ పాఠశాలలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఐదు సంవత్సరం నుంచి 10వ తరగతిలో 90 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు మాత్రమే అర్హులని చెప్పారు. మార్చి 25వ తేదీ వరకు కలెక్టర్ కార్యాలయంలోని తమ కార్యాలయంలో ప్రవేట్ పాఠశాలలు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 83285 08067 నంబర్‌కు సంప్రదించాలన్నారు.

Similar News

News February 17, 2026

రూ.595 కోట్లతో అమరావతిలో 2వ వరదనీటి పంపింగ్ స్టేషన్

image

AP: వరద నీటి నుంచి అమరావతి రక్షణకు రూ.595.01 కోట్లతో 2వ ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ ఏర్పాటుకు మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఉండవల్లి వద్ద 8400 క్యూసెక్కుల సామర్థ్యంతో ఇది ఏర్పాటు కానుంది. సర్వే, డిజైన్, నిర్మాణం, 15 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యత కాంట్రాక్టు సంస్థదేనని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా కొండవీటి వాగుపై ఉండవల్లి వద్ద 5000 క్యూసెక్కుల సామర్థ్యంతో ఒక వరదనీటి పంపింగ్ స్టేషన్ ఉంది.

News February 17, 2026

వ్యవసాయ రంగానికి పూర్తిగా సౌర విద్యుత్తు!

image

TG: రాష్ట్రంలోని 30 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు సౌర విద్యుత్ అందించాలని GOVT నిర్ణయించింది. ముందుగా నల్గొండ జిల్లా అనుముల, కనగల్, ముదిగొండలను సౌర గ్రామాలుగా మారుస్తారు. దీనికోసం సోలార్ పవర్ స్టేషన్ ఏర్పాటుకు ₹100 CR కేటాయించారు. అక్కడి 2వేల అగ్రి కనెక్షన్లను ఈ స్టేషన్‌కు అనుసంధానిస్తారు. క్రమేణా ఇతర ప్రాంతాల్లో సోలార్ స్టేషన్లు నెలకొల్పి 5 ఏళ్లలో వ్యవసాయ కనెక్షన్లన్నిటికీ సౌర విద్యుత్ అందిస్తారు.

News February 17, 2026

VIRAL: ఇస్త్రీ మరకతో ఉన్న షర్టు ఖరీదు రూ.లక్ష!

image

ఫ్యాషన్ ప్రపంచంలో వింతలకు కొదువ లేదు. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ ‘VETEMENTS’ తాజాగా విడుదల చేసిన ఒక షర్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇస్త్రీ చేస్తుండగా పొరపాటున చొక్కా కాలితే వచ్చే ‘ఐరన్ బర్న్’ మార్కును వీరు డిజైన్‌గా మార్చేశారు. దీని ధర $1,139 (సుమారు రూ. లక్ష). ఈ ధరను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి మరక పడితే ఇంట్లో గొడవ చేస్తామని, కానీ ఇదే ఓ ఫ్యాషన్ అయిందంటూ సెటైర్లు వేస్తున్నారు.