News December 4, 2025

సంగారెడ్డి: భారీగా రేషన్ బియ్యం పట్టివేత

image

మెదక్ జిల్లా తూప్రాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 285.70 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు విజిలెన్స్ డీఎస్పీ రమేష్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం నుంచి మహారాష్ట్రకు సన్న రేషన్ బియ్యము తరలిస్తున్నారు. నమ్మదగిన సమాచారం రావడంతో తూప్రాన్ పరిధి లోని అల్లాపూర్ టోల్ ప్లాజా వద్ద గురువారం వాహన తనిఖీ చేపట్టగా రేషన్ బియ్యం లారీ పట్టుబడినట్లు తెలిపారు. విజిలెన్స్ సీఐ అజయ్ బాబు పాల్గొన్నారు.

Similar News

News December 4, 2025

మొదటి రోజు ప్రశాంతంగా ముగింపు: జగిత్యాల కలెక్టర్

image

జగిత్యాల జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్‌ల స్వీకరణ మొదటి రోజు ప్రశాంతంగా జరిగింది. డిసెంబర్ 3 నాటికి సర్పంచ్ పదవికి 155, వార్డు సభ్యుల పదవులకు 304 నామినేషన్లు వచ్చినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. సత్యప్రసాద్ తెలిపారు. నామినేషన్ కేంద్రాల్లో అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తూ ప్రక్రియను సజావుగా నిర్వహించారు.

News December 4, 2025

ఎడపల్లి: ఎన్నికల విధులను అప్రమత్తతతో నిర్వహించాలి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల విధులను నిర్వర్తించే అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. గురువారం ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ​ఈ నెల 11న మండలంలో మొదటి విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నామినేషన్ల నుంచి పోలింగ్ ఏర్పాట్ల వరకు కలెక్టర్ సమీక్షించారు.

News December 4, 2025

ఏలూరు జిల్లా BJP మోర్చా కమిటీల నియామకం

image

ఏలూరు జిల్లా BJP మోర్చా కమిటీ నియామకాలను జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి కిషోర్ గురువారం ప్రకటించారు. కీర్తి వెంకట రాంప్రసాద్ జిల్లా అధ్యక్షుడిగా, ఇలపకుర్తి కుసుమ కుమారి మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అగ్రహారపు వెంకటేశ్వరరావు ఓబీసీ మోర్చా, బుర్రి శేఖర్ ఎస్సీ మోర్చా, సయ్యద్ మీర్ జాఫర్ అలీ మైనారిటీ మోర్చా, అడబాక నాగ సురేష్ యువ మోర్చా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు.