News April 16, 2025
సంగారెడ్డి: భూభారతిపై అవగాహన పక్కాగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలోని అన్ని మండలాల్లో ఈనెల 17 నుంచి 30 వరకు భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాలు పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాలు రైతులను పిలిచి భూభారతి చట్టం గురించి పూర్తిస్థాయిలో వివరించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్, అదనపు కలెక్టర్ మాదిరి పాల్గొన్నారు.
Similar News
News December 26, 2025
పేదల పక్షాన శతాబ్ది పోరాటం: ఎమ్మెల్సీ సత్యం

భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా సీపీఐ సాగించిన పోరాటాలు అద్వితీయమని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మగ్దూమ్ భవన్‌లో పతాకాన్ని ఆవిష్కరించారు. 1925లో కాన్పూర్‌లో ఆవిర్భవించిన నాటి నుంచి రైతు, కూలీ, అణగారిన వర్గాల హక్కుల కోసం సీపీఐ నిరంతరం పోరాడుతోందని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు.
News December 26, 2025
రాజమండ్రి: రేపటి నుంచి గ్రాండ్ కార్నివాల్

రాజమండ్రి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 27, 28 తేదీలలో గ్రాండ్ కార్నివాల్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. సుబ్రహ్మణ్యం మైదానంలో “ఫుడ్-మ్యూజిక్-ఫన్” థీమ్‌తో ఈ వేడుకలు జరగనున్నాయి. శని, ఆదివారాల్లో జరిగే ఈ కార్నివాల్‌లో మ్యూజికల్ ఈవెంట్స్, ఫుడ్ స్టాల్స్, గేమ్స్, సెల్ఫీ బూత్‌లు ఏర్పాటు చేశారు. నగర ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ వేడుకలను ఆస్వాదించాలని ఆయన కోరారు.
News December 26, 2025
చైనాతో సై అంటున్న భారత్!

చైనా ఎప్పటికైనా జిత్తులమారే అని గ్రహించిన భారత్.. సరిహద్దుల్లో మౌలిక వసతుల నిర్మాణాలను వేగవంతం చేస్తోందని అమెరికాకు చెందిన Wall Street Journal పేర్కొంది. 2020 బార్డర్ ఫైట్‌లో చైనా కొన్ని గంటల్లోనే ఆర్మీని తరలించగా ఇండియాకు వారం పట్టిందని తెలిపింది. దీంతో రోడ్లు, టన్నెల్స్, ఎయిర్ స్ట్రిప్స్ నిర్మాణాల కోసం Border Roads Organization బడ్జెట్‌ను $280 మిలియన్ల నుంచి $810 మి.కు పెంచిందని వివరించింది.


