News December 31, 2025
సంగారెడ్డి: భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి: కలెక్టర్

జిల్లాలో భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ప్రావీణ్య బుధవారం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తహశీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తులను వెంటనే పరిష్కరించే చర్యలు తీసుకోవాలని చెప్పారు. పరిష్కరించిన దరఖాస్తుల వివరాలు కలెక్టర్ కార్యాలయానికి పంపించాలని సూచించారు.
Similar News
News January 2, 2026
నేటి సామెత: కంచె వేసినదే కమతము

పంట పండించే భూమికి (కమతము) రక్షణగా కంచె ఉంటే ఆ భూమిలో అధిక దిగుబడి వస్తుంది. కంచె లేకపోతే పశువులు మేసేయడం లేదా ఇతరులు పాడుచేసే అవకాశం ఉండటం వల్ల దిగుబడి చాలా వరకు తగ్గుతుంది. అంటే, రక్షణ లేని ఆస్తి ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటుంది. మనం జీవితంలో కూడా ఎంత సంపాదించినా, దానికి పొదుపు లేదా క్రమశిక్షణ అనే కంచె లేకపోతే ఆ సంపాదన హరించుకుపోతుందని ఈ సామెత తెలియజేస్తుంది.
News January 2, 2026
సరస్వతి దేవి వీణానాదం – మనసుకు అమృతం

చదువుల తల్లి సరస్వతీ దేవి చేతిలో వీణ ఉంటుంది. అందులో నుంచి వచ్చే సప్తస్వరాల తరంగాలు మన మెదడులోని నరాలను ఉత్తేజపరుస్తాయి. రోజూ శాస్త్రీయ సంగీతం వింటే మనస్సు ప్రశాంతంగా మారి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఒత్తిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే ఈ నాదం విద్యార్థులకు, మేధావులకు ఎంతో మేలు చేస్తుంది. దైవత్వం అంటే కేవలం ప్రార్థన మాత్రమే కాదు, మన జీవనశైలిని మెరుగుపరిచే ఒక గొప్ప విజ్ఞానం కూడా!
News January 2, 2026
త్వరలో 265 పోస్టుల భర్తీ: మంత్రి కోమటిరెడ్డి

TG: R&B శాఖలో ఖాళీగా ఉన్న 265 ఇంజినీర్ల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఫీల్డ్‌లో ఉండే AEలకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న సీనియారిటీ సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. R&B ఇంజినీర్స్ డైరీ, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. తమ శాఖ ఇంజినీర్లు, ఉద్యోగులు తనకు కుటుంబ సభ్యులతో సమానమన్నారు. తర్వాత ఉద్యోగులతో కలిసి భోజనం చేశారు.


