News November 10, 2025

సంగారెడ్డి: మంత్రుల వీడియో కాన్ఫరెన్స్

image

రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్‌లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు తీరును అడిగి తెలుసుకున్నారు. పత్తి కొనుగోలు ఎకరాకు 7 క్వింటాల నుంచి 12 క్వింటాలకు కొనుగోలు పెరిగేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని మంత్రులు తెలిపారు. కలెక్టర్లు ధాన్యం కొనుగోలను దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు.

Similar News

News November 11, 2025

జిల్లాలో కుష్టు వ్యాధిపై ఇంటింటి సర్వే నిర్వహించాలి: జేసీ

image

ఈ నెల 17 నుంచి 30 వరకు కుష్టు వ్యాధిపై ఇంటింటి సర్వే నిర్వహించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమంపై సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ హాలులో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలన్నారు.

News November 11, 2025

HYD: బైక్‌లపై వచ్చి ఇంటింటా ‘ఓటు కవర్‌’ డెలివరీ!

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రేపు(మంగళవారం) బైపోల్ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. పోలీసులు, ఎన్నికల అధికారుల నిఘా ఉన్నప్పటికీ, బైక్‌లపై కొందరు పేపర్‌ బాయ్‌ తరహాలో బస్తీల్లోని ప్రతి ఇంటి వద్దకు వచ్చి, డబ్బు, గుర్తుతో ఉన్న ఎన్వలప్ కవర్లను విసిరేసి పోతున్నారు. ఓటు కోసం విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీని నియంత్రించేందుకు అధికార యంత్రాంగం చర్యలు ముమ్మరం చేసింది.