News June 21, 2024
సంగారెడ్డి: మద్యానికి బానిసై యువకుడి మృతి

మద్యానికి బానిసైన ఓ యువకుడు మృతిచెందిన ఘటన శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాలు.. అర్బింద్ కుమార్(27) భార్య, పిల్లలతో కలిసి 3ఏళ్ల క్రితం ఉత్తర భారతదేశం నుంచి సంగారెడ్డి సదాశివపేటకు వలస వచ్చాడు. మద్యానికి బానిసైన అతడిని తన భార్య స్వగ్రామానికి తీసుకెళ్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు రాగా 4వ గేట్ సమీపంలో అర్బింద్ ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు.
Similar News
News December 19, 2025
మెదక్: ‘అప్రమత్తతో ప్రాణ నష్ట నివారణ’

ముందస్తు అప్రమత్తతతో విపత్తుల సమయంలో ప్రాణత్యాగాలు నివారించవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పేర్కొన్నారు. పకృతి విపత్తుల నిర్వహణకు సంబంధించి మాక్ ఎక్సర్సైజ్ నిర్వాహణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. 22న నిర్వహించే మాక్ ఎక్సర్సైజ్ విజయవంతం చేయాలని సూచించారు.
News December 19, 2025
మెదక్: వెబ్ సైట్‌లో మెరిట్ లిస్ట్ వివరాలు: డీఈఓ

మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలలో ఖాళీలు గల అకౌంటెట్, ANM ఉద్యోగాల భర్తీ కోసం మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల మెరిట్ లిస్ట్ వివరాలను జిల్లా విద్యాశాఖాధికారి వెబ్ సైట్ (https://medakdeo.com/)లో ఉంచినట్లు డీఈఓ విజయ తెలిపారు. దరఖాస్తులు స్వీకరించిన అనంతరం ఆన్లైన్ ఉంచినట్లు పేర్కొన్నారు.
News December 19, 2025
అంబేడ్కర్ విగ్రహ రూపశిల్పి మృతికి కేసీఆర్ సంతాపం

125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ రూపశిల్పి, పద్మభూషణ్ రామ్ వాంజీ సుతార్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ప్రపంచ స్థాయి శిల్ప కళా ప్రతిభతో కోహినూర్ వజ్రంలా నిలిచిన రామ్ సుతార్ సేవలు అపారం అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ గర్వకారణంగా నిలిచేలా అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని తీర్చిదిద్దారని ప్రశంసించారు. ఆయన మరణం శిల్ప కళా రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.


