News March 5, 2025
సంగారెడ్డి: మహిళతో శారీరకంగా కలిసి.. చివరికి

హత్య కేసును గుమ్మడిదల పోలీసులు చేధించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బిక్య తండాకు చెందిన నిందితుడు 2024 DECలో కౌడిపల్లి మండలం కన్నారం శేరి తండాకు చెందిన కేతవత్ మునీని మాయమాటలు చెప్పి గుమ్మడిదల కల్లు షాప్ నుంచి ఆమెను నల్లవల్లి అడవిలోకి తీసుకెళ్లాడు. శారీరకంగా కలసి, చున్నీతో ఆమె గొంతుకు చుట్టి ఉపిరాడకుండా చేసి చంపేశాడు. నేరస్థుడిని CC కెమెరాల ద్వారా గుర్తించి గుమ్మడిదల పోలీసులు పట్టుకున్నారు.
Similar News
News March 5, 2025
మీనాక్షి స్వీట్ వార్నింగ్

కాంగ్రెస్లో క్రమశిక్షణ తప్పితే చర్యలుంటాయని TPCC ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. ఎవరి తీరుపై అసంతృప్తి ఉన్నా అంతర్గత సమావేశాల్లో చెప్పాలన్నారు. మీడియా ముందు, సోషల్ మీడియాలో వాటిని చెప్పొద్దని హెచ్చరించారు. సీనియర్లకు ప్రాధాన్యత దక్కడం లేదని మెదక్ పార్లమెంట్ స్థానం స్థాయి భేటీలో సీనియర్లు వాపోయారు. దీంతో పదేళ్లకు పైగా పని చేసిన వారికి పీసీసీలో చోటు కల్పిస్తామని మీనాక్షి హామీ ఇచ్చారు.
News March 5, 2025
నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడు అదృశ్యం

నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి గొల్లగూడలో మూడేళ్ల బాలుడు అదృశ్యమైనట్లు పట్టణ టూ టౌన్ ఎస్ఐ నాగరాజు తెలిపారు. పట్టణ ఆయన తెలిపిన వివరాలు.. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి గొల్లగూడలో మూడేళ్ల బాలుడు అబ్దుల్ అహ్మద్ (అబ్బు) ఆడుకుంటూ తప్పిపోయాడని తెలిపారు. బాబు ఆచూకీ తెలిసినవారు సెల్ నం.8712670171, 8712667671లకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ నాగరాజు పేర్కొన్నారు
News March 5, 2025
పెద్దపల్లి: నేడే పరీక్షలు.. ALL THE BEST

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 10,985 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఫస్టియర్ 5,844, సెకండియర్లో 5,141 మంది విద్యార్థులు రాయనుండగా.. 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇంటర్ పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో BNS 163(144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒక నిమిషం ఆలస్యాన్ని తాజాగా 5 నిమిషాలకు సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ALL THE BEST