News March 12, 2025
సంగారెడ్డి: మహిళా డ్రైవర్లకు లైసెన్సులు ఇప్పించాలి: కలెక్టర్

డ్రైవింగ్ శిక్షణ పొందిన మహిళలకు లైసెన్సులు ఇప్పించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి క్యాంప్ కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కార్ల కొనుగోలుకు రుణాలు ఇప్పించాలని పేర్కొన్నారు. చేసిన కార్లను కార్పొరేట్ కంపెనీలో ఏర్పాటు చేసిన చూడాలని చెప్పారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 17, 2025
‘సర్పంచ్’ రిజల్ట్స్.. ఒక్క ఓటుతో..

TG: మూడో విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లోనూ పలువురు అభ్యర్థులు ఒక్క ఓటుతో విజయం సాధించారు. భద్రాద్రి జిల్లా నలబండబోడులో కాంగ్రెస్ అభ్యర్థి ఝాన్సీపై బీఆర్ఎస్ అభ్యర్థి సింధు ఒక్క ఓటు తేడాతో గెలిచారు. మొత్తం 139 ఓట్లు పోలవ్వగా ఝాన్సీకి 69, సింధుకి 70 ఓట్లు వచ్చాయి. సంగారెడ్డి(D) బాణాపూర్‌లోనూ ఇదే రిజల్ట్ రిపీటైంది. శంకర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ ఒక్క ఓటు తేడాతో గెలిచారు.
News December 17, 2025
ప్రశాంతంగా ముగిసిన గ్రామపంచాయతీ ఎన్నికలు: ఎస్పీ నరసింహ

జిల్లాలో మూడు విడతల పంచాయతీ ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ నరసింహ వెల్లడించారు. 1,500 మంది పోలీసు సిబ్బంది అహర్నిశలు శ్రమించి ఎన్నికలను విజయవంతం చేశారని కొనియాడారు. తనిఖీల్లో భాగంగా రూ.10.53 లక్షల విలువైన మద్యం, నగదు స్వాధీనం చేసుకున్నామని, 1,488 మందిని బైండోవర్ చేశామని తెలిపారు. ఎన్నికల విధుల్లో అంకితభావంతో పనిచేసిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
News December 17, 2025
అలిపిరి వద్ద అపచారం.. TTD చర్యలు

అలిపిరి సమీపంలోని TTD భూదేవి కాంప్లెక్స్‌లో మద్యం సీసాలు, మాంసం లభ్యమవడం కలకలం రేపింది. దర్శన టికెట్లు జారీ చేసే ప్రాంతంలోనే ఇవి గుర్తించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. TTD విజిలెన్స్ నిర్లక్ష్యమే కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన TTD అధికారులు.. భూదేవి కాంప్లెక్స్‌లో విధుల్లో ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.


