News January 30, 2025
సంగారెడ్డి: మాదకద్రవ్యాల నిర్మూలన జిల్లాకు ప్రత్యేక గుర్తింపు: ఎస్పీ

మాదక ద్రవ్యాల నిర్మూలనలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంత్లీ క్రైమ్ రివ్యూ సమావేశం బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 100కు వచ్చే కాల్స్ సత్వర పరిష్కారం కోసం 20 ట్యాబ్‌లు వచ్చినట్లు చెప్పారు. ట్రాఫిక్ చర్యలో భాగంగా 10 బ్రీత్ అనలైజర్, 5 కెమెరాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. సమావేశంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Similar News
News September 18, 2025
పెద్దవం, ఐ.పంగిడీ గ్రామాల్లో కలెక్టర్ కీర్తి చేకూరి పర్యటన

ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో పశువుల చికిత్సలకు ప్రత్యేక వైద్యుల బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపడం జరిగిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. గురువారం తాళ్లపూడి మండలం పెద్దేవం, ఐ.పంగిడీ గ్రామాల్లో కలెక్టర్ పర్యటించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. గేదెల వ్యాధి నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
News September 18, 2025
‘కేసీఆర్ కుటుంబం తెలంగాణను అప్పులపాలు చేసింది’

తెలంగాణను KCR కుటుంబం అప్పుల పాలు చేసిందని PCC ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం మండిపడ్డారు. KNRలోని R&B గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో హరీశ్‌రావు అవినీతికి పాల్పడ్డారని కవిత ఆరోపించగా, KCR సూత్రధారి అని హరీశ్‌రావు విచారణలో చెప్పారని అన్నారు. నయీం ఆస్తులను KCR తన ఖజానాలో జమచేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని గజ్జల కాంతం తీవ్ర ఆరోపణలు చేశారు.
News September 18, 2025
ఆనందపురం: కుక్క అడ్డురావడంతో ఆటో బోల్తా.. వ్యక్తి మృతి

ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగన్నాధపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఎర్ర గౌరి నాయుడు(40) గురువారం మధ్యాహ్నం కుసులవాడ తీగలవానిపాలెం చెరువు దగ్గర కుక్క అడ్డం రావడంతో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. తలకు తీవ్ర గాయాలవల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.