News February 27, 2025
సంగారెడ్డి: మార్చి 1 నుంచి పోలీస్ యాక్ట్ అమలు

మార్చి 1 నుంచి 31వరకు సంగారెడ్డి జిల్లాలో పోలీస్ చట్టం అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ రూపేష్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించకూడదని సూచించారు. అనుమతి లేకుండా ఎవరైనా కార్యక్రమాలు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News February 28, 2026
డొంకరాయి ఏవీపీ డ్యామ్‌లో యువకుడి గల్లంతు

గుర్తేడు మండలం బొడ్డుగండి పంచాయితీ డొంకరాయి ఏవీపీ డ్యాములో స్నానానికి దిగిన యువకుడు శనివారం గల్లంతయ్యాడు. ఎస్సై చరణ్ నాయక్ తెలిపిన వివరాలు.. వైజాగ్ నుంచి ఐదుగురు స్నేహితులు డొంకరాయి పరిసర ప్రాంతాల్లో ప్రకృతి అందాలను తిలకించేందుకు వచ్చారు. వీరిలో విశాఖపట్నం జిల్లా ఆరిలోవకు చెందిన లోచర్ల హరిప్రసాద్ వయసు 36 సం. యువకుడు రిజర్వాయర్లో గల్లంతు అయ్యాడు. అతని ఆచూకీ దొరకలేదని గాలిస్తున్నామన్నారు
News February 28, 2026
కరీంనగర్: ఎలక్ట్రిక్ వాటర్ వీల్స్ అందజేసిన కేంద్ర మంత్రి

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్ మనోజ్ కుమార్ శనివారం హైదరాబాదులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కుమ్మరి వృత్తి శిక్షణ పొందిన వారికి ఎలక్ట్రిక్ పాటర్ వీల్స్ అందజేశారు. ‘గ్రామోద్యోగ వికాస్ యోజన’ పథకంలో భాగంగా గ్రామీణ చేతి వృత్తులను ప్రోత్సహించడానికి వీలుగా అధునాతన పనిముట్లు అందజేస్తున్నట్లు వారు తెలిపారు. సంబంధిత శాఖ ఉద్యోగులు, వృత్తి కళాకారులు పాల్గొన్నారు.
News February 28, 2026
కొండపాక: ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతుల మృతి!

కొండపాక వద్ద కారు, డీసీఎం వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. సింగరేణి ఉద్యోగి అబ్దుల్ రఫీ ఘటనా స్థలంలోనే మృతి చెందగా, ఆయన భార్య మజ్దూర్ బేగం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రోడ్డు మరమ్మతుల వల్ల వన్‌వే అమలులో ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.


