News February 27, 2026
సంగారెడ్డి: మార్చి 1 నుంచి పోలీస్ యాక్ట్: ఎస్పీ

సంగారెడ్డి జిల్లాలో మార్చి 1 నుంచి 31 వరకు పోలీస్ యాక్ట్ 30, 30(ఎ) అమలులో ఉంటుందని ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
Similar News
News February 28, 2026
పెళ్లి రోజు వర్షం పడితే అశుభమా?

పెళ్లి రోజు వాన పడటం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ‘వర్షాన్ని స్వచ్ఛత, శ్రేయస్సు, దైవిక ఆశీర్వాదాలకు చిహ్నంగా భావిస్తారు. వివాహ సమయంలో వర్షం కురిస్తే ఆ నూతన వధూవరులు అదృష్టవంతులని, వారు జీవితాంతం సిరిసంపదలతో, సంతానంతో కలకాలం సంతోషంగా ఉంటారని నమ్మకం. ఇది వారి కొత్త జీవితంలో ఎదుగుదలకు, శుభారంభానికి సంకేతం. అయితే ఈ విషయాలు విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయని గమనించాలి’ అంటున్నారు.
News February 28, 2026
ESIC రాయ్‌పూర్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News February 28, 2026
WGL: కాసేపట్లో నింగిలోకి ‘రుద్రమ-1’ రాకెట్

భద్రకాళి బండ్ వేదికగా ‘రుద్రమ-1’ మోడల్ రాకెట్‌ను శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రయోగించనున్నారు. 250 గ్రాముల బరువు, 4 అడుగుల ఎత్తు ఉన్న ఈ చిట్టి రాకెట్ శాస్త్ర సాంకేతిక రంగంపై ఆసక్తి ఉన్న వారిని ఆకట్టుకుంటోంది. ప్లాస్టిక్, బాల్సా ఉడ్, ఫైబర్ వంటి తేలికపాటి పదార్థాలతో దీనిని రూపొందించారు. ప్రయోగం తర్వాత ఇది సుమారు 3 వేల అడుగుల ఎత్తుకు చేరుకుంటుందని అంచనా.


