News January 6, 2026
సంగారెడ్డి: ముందు భార్య.. తర్వాత భర్త సూసైడ్

SRD జిల్లాలో <<18772211>>దంపతులు ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. APలోని కర్నూల్ జిల్లా మద్దికేర మం.నికి చెందిన లాల్ శేఖర్(32), అనూష(25) రెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం వచ్చి అమీన్పూర్ పరిధిలో ఐలాపూర్ చిన్నతండాలో ఉంటున్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. పుట్టింటికి వెళ్లిన భార్య అక్కడ సూసైడ్ చేసుకోగా విషయం తెలిసి భర్త తన ఇంట్లో ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 9, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 9, శుక్రవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.23 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.22 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.58 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.15 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 9, 2026
నిర్మల్: ఇంటర్ పరీక్షకు 13,125 మంది విద్యార్థులు

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం బోర్డు పరీక్షకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కలిపి జిల్లా వ్యాప్తంగా మొత్తం 23 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష కేంద్రాల్లో 6,652 మంది ప్రథమ, 6,473 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులు మొత్తం 13,125 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు అధికారులు వివరించారు. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి18 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.
News January 9, 2026
ఈడీ vs ఐప్యాక్: హైకోర్టుకు చేరిన వివాదం!

కోల్‌కతాలోని ఐప్యాక్ ఆఫీసులో ED చేసిన <<18797775>>రెయిడ్స్<<>>పై రోజంతా హైడ్రామా నడిచింది. మమత వర్సెస్ ఈడీ అన్నట్లు సాగిన ఈ వ్యవహారం చివరికి కలకత్తా హైకోర్టుకు చేరింది. ఈడీ, ఐప్యాక్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. బెంగాల్ కోల్ మైనింగ్ స్కామ్‌కు సంబంధించి తాము సోదాలు చేశామని, తమను మమత అడ్డుకున్నారని ఈడీ తమ పిటిషన్లో పేర్కొంది. ఈడీ రెయిడ్స్‌ను ఆపేలా ఆదేశించాలని ఐప్యాక్ అభ్యర్థించింది.


