News February 12, 2025
సంగారెడ్డి: ముగిసిన క్రీడా పోటీలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739270353015_52141451-normal-WIFI.webp)
నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని అంబేద్కర్ మైదానంలో రెండు రోజులపాటు నిర్వహించిన క్రీడా పోటీలు మంగళవారం ముగిస్తాయి. కబడ్డి, వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నెహ్రూ యువ కేంద్రం రాష్ట్ర మాజీ డైరెక్టర్ వెంకటేశం, జిల్లా క్రీడ అభివృద్ధి అధికారి కాసిం బేక్ విజేతలకు బహుమతులు అందించారు.
Similar News
News February 12, 2025
NRPT: ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739277678804_51550452-normal-WIFI.webp)
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం నారాయణపేట కలెక్టరేట్ లో మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ర్యాండమైజేషన్ నిర్వహించినట్లు చెప్పారు. ప్రిసైడింగ్, ఓ పి ఓ లను నియమించారు. త్వరలో వీటికి మాస్టర్ ట్రైనర్ ల తో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
News February 12, 2025
జేఈఈ మెయిన్స్‌లో మెరిసిన ఖేడ్ విద్యార్థి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739289073757_20506371-normal-WIFI.webp)
మంగళవారం విడుదలైన జేఈఈ మెయిన్స్- 2025 ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా యువకుడు సత్తా చాటాడు. నారాయణఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి మెగావత్ పరశురాం జేఈఈ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్‌లో NTA స్కోర్ 74.6724856 సాధించాడని కళాశాల ప్రిన్సిపల్ ఉమా మహేష్ తెలిపారు. దీంతో పరశురాంను అధ్యాపకులు, తల్లిదండ్రులు, స్నేహితులు అభినందించారు.
News February 12, 2025
ADB: EPASS SCHOLARSHIPS.. APPLY NOW
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739289514808_51600738-normal-WIFI.webp)
ADB జిల్లాలో ఇంటర్ ఆపైన చదువుతున్న పోస్ట్ మెట్రిక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగుల విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరానికి ఉపకారవేతనాలకు ఈపాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని DSCDO సునీత కుమారి తెలిపారు. రినివల్, ఫ్రెష్ పోస్ట్మెట్రిక్ విద్యార్థులు 31 మార్చి వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉపకారవేతనములు పొందేందుకు SSC మెమో, ఆధార్ కార్డులలోని పేరు ఒకేలా ఉండాలన్నారు.