News February 2, 2025
సంగారెడ్డి: ముగిసిన బడి బయట పిల్లల సర్వే
సంగారెడ్డి జిల్లాలో జనవరి 11 నుంచి సీఆర్పీలు, ఐఈఆర్పీలు నిర్వహించిన బడి బయట పిల్లల సర్వే శనివారంతో ముగిసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. బడి బయట పిల్లల సర్వేలో గుర్తించిన పిల్లల వివరాలను ప్రభంధ పోర్టల్ వెబ్సైట్‌లో నమోదు చేయాలని సీఆర్పీలకు, ఐఈఆర్పీలకు సూచించారు.
Similar News
News February 2, 2025
టెన్త్ విద్యార్థులకు ‘స్నాక్స్’ ప్రారంభం
TG: ప్రభుత్వ, మోడల్ స్కూళ్లలో చదువుతున్న టెన్త్ విద్యార్థులకు ఈవెనింగ్ స్నాక్స్ అందించే కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. మార్చి 20వ తేదీ వరకు దీనిని ప్రభుత్వం అమలు చేయనుంది. ఉడకబెట్టిన పెసర్లు, పల్లీలు, బెల్లం, మిల్లెట్ బిస్కెట్లు, ఉడకబెట్టిన బొబ్బర్లు, శనగలు, ఉల్లిపాయ పకోడి రోజుకొక రకం ఇవ్వనున్నారు. స్పెషల్ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు స్నాక్స్ అందిస్తున్నారు.
News February 2, 2025
ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నీకి సిద్దిపేట విద్యార్థులు
దుబాయ్‌లో ఫిబ్రవరి 2 నుంచి జరగనున్న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నీ(U-19)కి సిద్దిపేటకు చెందిన పవనసుత హనుమాన్, లక్ష్మి మణికాంత్ ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులు, క్రికెట్ అకాడమీ కోచ్ ముత్యాల ఆనంద్‌ను శనివారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. టోర్నమెంట్‌లో విజయాలను సాధించాలన్నారు.
News February 2, 2025
MNCL: రాష్ట్రస్థాయి పోటీల్లో మెరిసిన జిల్లా విద్యార్థులు
ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఇంగ్లీష్ ఒలింపియాడ్, ఉపన్యాస పోటీల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో జిల్లా విద్యార్థులు ఎం.సంజన, ఎ.అభివర్థిని, ఎస్.అరవిందరాణి ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. శనివారం విద్యార్థులను డీఈఓ యాదయ్య అభినందించారు.