News February 14, 2026
సంగారెడ్డి: మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభ్యర్థుల ప్రకటన

సంగారెడ్డి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభ్యర్థులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శనివారం ప్రకటించారు. ఛైర్మన్ అభ్యర్థిగా 23వ వార్డు కౌన్సిలర్ కూన వనితను, వైస్ ఛైర్మన్ అభ్యర్థిగా 24వ వార్డు కౌన్సిలర్ షేక్ షఫీయొద్దీన్‌ను ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 16న జరిగే ఎన్నికల్లో వీరిని ఎన్నుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. దీంతో సంగారెడ్డి మున్సిపల్ పీఠంపై ఉత్కంఠకు తెరపడింది.
Similar News
News February 14, 2026
ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలి: CM రేవంత్

TG: మున్సిపల్ ఫలితాలపై మంత్రులతో CM రేవంత్ భేటీ ముగిసింది. కాంగ్రెస్ విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేసిన మంత్రులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఏ ఎన్నికైనా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని మంత్రులకు స్పష్టం చేశారు.
News February 14, 2026
పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం

పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో అగస్త్య మహాముని స్వయంగా లింగాన్ని ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ప్రాచీన ఆలయం చోళుల కాలంలో నిర్మించబడి, శైవ సంప్రదాయానికి పేరు పొందింది. ఇక్కడ శివుడు అగస్తీశ్వరునిగా, పార్వతి దేవి మీనాక్షిగా పూజలందుకుంటారు. ఆలయంలోని శివలింగం 6 వేల సంవత్సరాల పురాతమైనదిగా ప్రజల నమ్మకం.
News February 14, 2026
‘శివ లింగం’ అంటే ఏంటంటే?

పరమశివుని ఆరాధనలో ‘శివలింగం’ అత్యంత ముఖ్యమైనది. శాస్త్రాల ప్రకారం శివలింగం అంటే భగవంతుని ఒక రూపం లేదా ప్రతీక అని అర్థం. కంటికి కనిపించని ఆ పరమేశ్వరుడిని భక్తితో ఒక శిలా లేదా విగ్రహ రూపంలో ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి, స్థితి, లయకారుడైన ఆ దేవుని అనుగ్రహం పొందేందుకు ‘శివలింగారాధన’ ఒక గొప్ప మార్గం. ఈ ఆరాధన ద్వారా భక్తులు మానసిక ప్రశాంతతను, శివుడి అనుగ్రహాన్ని పొందుతారని పురోహితులు చెబుతున్నారు.


