News January 16, 2026

సంగారెడ్డి: మున్సిపల్ రిజర్వేషన్లపై ఉత్కంఠ

image

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో కేటగిరీల వారిగా రిజర్వేషన్లను ప్రకటించారు. దీంతో ఏ వార్డు ఏ రిజర్వేషన్ వస్తుందని అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. మరో రెండు రోజుల్లో వార్డుల వారిగా రిజర్వేషన్లు విడుదలై అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కొన్నిచోట్ల రిజర్వేషన్లు ఖరారైనట్లు సమాచారం. అయితే అధికారికంగా రిజర్వేషన్లు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఆశావహులు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Similar News

News February 2, 2026

జిల్లాలో ఎరువుల కొరత లేదు: జేడీ

image

కాకినాడ జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయశాఖ జెడీ విజయకుమార్ సోమవారం స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో అన్ని రకాల పంటలకు అవసరమైన 35,576 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. సోమవారం కూడా ఎం.ఎఫ్.ఎల్ (MFL) ద్వారా మరో 500 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయిందని పేర్కొన్నారు. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 2, 2026

తిప్పనగుంటలో Way2News కథనానికి స్పందన

image

బాపులపాడు మండలం తిప్పనగుంటలో వాగు వంతెన సమీపంలోని <<19023974>>విద్యుత్ స్తంభాలు <<>>నేలకి ఒరిగి ప్రమాదకరంగా మారడంతో రైతులు, స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ‘తిప్పనగుంటలో ప్రమాదకరంగా స్తంభాలు’ శీర్షికన ఆదివారం Way2News కథనాన్ని ప్రచురించింది. స్పందించిన వీరవల్లి సబ్‌స్టేషన్‌ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు ఓరిగిపోయిన విద్యుత్ స్తంభానికి సోమవారం మరమ్మతులు చేపట్టారు.

News February 2, 2026

బండ్లపల్లిలో పర్యటించిన వైయస్ షర్మిలా రెడ్డి

image

ఏపీ కాంగ్రెస్ పార్టీ PCC అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డి నార్పల మండలం బండ్లపల్లిలో పర్యటించారు. ముందుగా గ్రామ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆమె అభివాదం చేశారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా వైయస్ షర్మిలా రెడ్డిని చూసేందుకు ప్రజలు బారులు తీరారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె గ్రామంలోకి రావడంతో పూలు వెదజల్లి ఘన స్వాగతం పలికారు.