News May 16, 2024

సంగారెడ్డి, మెదక్ జిల్లాలో సాగుకు సమాయత్తం

image

వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌ పంటల సాగు ప్రణాళికను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. ఏ పంట ఎంత మేరకు సాగు కానున్నది. ఇందుకు అనుగుణంగా ఏ రకం విత్తనాలు ఎంత మేరకు అవసరం అవుతాయని అంచనాలను రూపొందించారు. గత సీజన్‌ కంటే ఈసారి వరి, పత్తి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశమున్నట్లు అంచనా వేశారు. సంగారెడ్డి జిల్లాలో 7,24,405 ఎకరాల్లో అన్ని రకాల పంటలు, మెదక్‌ జిల్లాలో 3,73,509 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లు అంచనా వేశారు.

Similar News

News October 5, 2024

పిల్లల భద్రత.. మన అందరి బాధ్యత: సిద్దిపేట సీపీ

image

దసరా సెలవుల దృష్ట్యా పిల్లల భద్రత పట్ల తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ అనురాధ సూచించారు. నేటి బాలలే రేపటి పౌరులని, భవిష్యత్తు భారతావనికి వారే పునాదులని, వారిని కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదన్నారు. ప్రతి సంవత్సరం దసరా సెలవుల్లో ఎంతో మంది అమాయక విద్యార్థులు ఆకారణంగా ప్రాణాలు పోగొట్టుకొని కన్నా వారికీ కడుపుకోత మిగిలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

News October 5, 2024

కేసీఆర్ ఇంటి ముందు దీక్ష చేస్తా: జగ్గారెడ్డి

image

రాహుల్ గాంధీ ఇంటి ముందు హరీశ్ రావు దీక్ష చేస్తే తాను మాజీ సీఎం కేసీఆర్ ఇంటి ముందు చేస్తానని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. BRS పదేళ్ల పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో హరీశ్ రావుతో బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో రుణమాఫీ చేసినట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు.

News October 5, 2024

సిద్దిపేట: కాసేపట్లో కొడుకు పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి

image

కొద్ది గంటల్లో కుమారుడి పెళ్లి జరగనుండగా అంతలోనే జరిగిన ప్రమాదంలో తండ్రి మృతి చెందాడు. ఈ విషాద ఘటన తొగుట మండలం వెంకట్రావుపేట వద్ద తెల్లవారుజామున జరిగింది. రాయపోల్ మండలం మంతూరు గ్రామానికి చెందిన మహమ్మద్ ఖాసిం(మాజీ వీఆర్ఏ) కుమారుడు నిజాముద్దీన్ వివాహం ఈరోజు జరగాల్సి ఉంది. భార్య సాహెరా, మరో కుమారుడు వసీయోద్దీన్‌తో కారులో వస్తుండగా వెంకట్రావుపేట వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.