News September 19, 2025
సంగారెడ్డి: మెరిట్ జాబితా విడుదల: డీఈవో

కేజీబీవీలో తాత్కాలిక పద్ధతిగా పనిచేసేందుకు ఏఎన్ఎం అకౌంటెంట్ మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. జాబితా www.sangareddy.telangana.gov.inలో వచ్చినట్లు చెప్పారు. జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 22లోపు ఆధారాలతో సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.
Similar News
News September 19, 2025
పోషణ మాసం ఉత్సవాలను వినూత్నంగా నిర్వహించాలి: కలెక్టర్

పోషణ మాసం ఉత్సవాలను వినూత్నంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో ఆమె సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు పోషణ మాసం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నారు.
News September 19, 2025
బ్యాటింగ్‌కు రాని సూర్యకుమార్.. ఏమైంది?

ఆసియా కప్: ఒమన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు రాలేదు. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే సూర్య కోసం చివరి వరకు అభిమానులు వెయిట్ చేశారు. ప్యాడ్లు ధరించి డగౌట్‌లో కనిపించిన SKY క్రీజులోకి ఎందుకు రాలేదని, ఆయనకు ఏమైందనే చర్చ SMలో జరుగుతోంది. కాగా, మిగతా ప్లేయర్లకు బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాలనే సూర్య బరిలోకి దిగలేదని తెలుస్తోంది.
News September 19, 2025
KMR: టీఎల్ఎం మేళాలో తెలుగు విభాగంలో ఉత్తమ ప్రదర్శనకు ప్రశంసాపత్రం

కామారెడ్డి జిల్లా FLN TLM మేళా ప్రదర్శనలో తెలుగు విభాగంలో SGT ఉపాధ్యాయుడు అంజనీ ప్రసాద్ ఉత్తమ ప్రదర్శన కనబరిచి మొదటి స్థానంలో నిలిచారు. అంబారీపేట పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఆయన నూతన ఒరవడులు సృష్టించేలా బోధనాభ్యాసన సామర్థ్యాలను ప్రదర్శించారు. జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఆయనకు ప్రశంసాపత్రం అందించారు. ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.