News February 21, 2025
సంగారెడ్డి: మైనర్ బాలికపై లైంగిక దాడి

మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంగారెడ్డి మండలం ఫసల్వాది పరిధిలోని రెండు పడక గదుల ఇళ్ల సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఎనిమిది సంవత్సరాల పాపను ఇద్దరు వ్యక్తులు పక్కనే ఉన్న ముళ్లపొదల్లోకి తీసుకెళ్లారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడడంతో తీవ్ర రక్తస్రావమైంది. వారిలో ఒకరిని స్థానికులు పట్టుకొని చితకబాదారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Similar News
News December 24, 2025
వాళ్లకు పెన్షన్లు కట్!

TG: పేదలకు అందాల్సిన పెన్షన్లు పక్కదారి పడుతున్నట్లు ప్రభుత్వం చేపట్టిన సోషల్ ఆడిట్లో బయటపడింది. 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా 20వేల శాంపిల్స్ సేకరిస్తే అందులో 2వేల మంది అనర్హులుగా తేలింది. ధనవంతులు, 50ఏళ్లు నిండని వారు, వైకల్యం లేకున్నా దివ్యాంగ పెన్షన్లు, చనిపోయినవాళ్లపై ఇతరులు ఇలా అక్రమంగా చేయూత పొందుతున్నట్లు గుర్తించారు. వీళ్లందరికీ పెన్షన్లు కట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
News December 24, 2025
ALL SET: 8.54amకు నింగిలోకి..

AP: LVM3-M6 రాకెట్ ప్రయోగానికి తిరుపతి(D) శ్రీహరికోటలోని SDSC సిద్ధమైంది. 8:54amకు USకు చెందిన 6,100KGల బ్లూబర్డ్ బ్లాక్-2 కమ్యూనికేషన్ శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇది భారత్ నుంచి లోఎర్త్ ఆర్బిట్(LEO)లోకి పంపనున్న అత్యంత బరువైన కమర్షియల్ కమ్యూనికేషన్ ఉపగ్రహం. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ఫోన్లకు ఇది నేరుగా 4జీ, 5జీ సిగ్నల్స్ అందించి మొబైల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది.
News December 24, 2025
ధనుర్మాసం: తొమ్మిదో రోజు కీర్తన

గోదాదేవి సంపదలు గల కన్యను నిద్రలేపుతోంది. రత్నాల మేడలో, హంసతూలికా తల్పంపై నిద్రిస్తున్న తన మేనమామ కూతురితో ‘భగవంతుని నామాలు ఇంతలా స్మరిస్తున్నా నీకు వినబడడం లేదా? గడియ తీయవేమ్మా!’ అని అంటోంది. తన కూతురింకా లేవకపోవడంతో ‘మేనత్తా! నీవైనా లేపు. తను మూగదా? చెవిటిదా? లేక మంత్రం వేసినట్టు ఎందుకు నిద్రపోతోంది?’ అని సరదాగా నిలదీస్తుంది. భగవదనుభవం కోసం అందరూ కలిసి రావాలని ఈ పాశురం చెబుతుంది. <<-se>>#DHANRUMASAM<<>>


