News January 5, 2026
సంగారెడ్డి: మైనార్టీ మహిళలకు కొత్త పథకాలు

మైనార్టీ మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ‘రేవంత్ అన్నా కా సహారా – మిస్కీన్ కేలియే’, ‘ఇందిరమ్మ మైనార్టీ’ అనే రెండు ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టిందని సంగారెడ్డి జిల్లా మైనార్టీ అధికారి విశాలాక్షి తెలిపారు. ఈ పథకాలకు అర్హులైన వారు ఈనెల 10లోగా <
Similar News
News February 19, 2026
VJA: గాంధీ హిల్స్‌లో ప్రేమ జంటల వెకిలి చేష్టలు..!

విజయవాడలోని గాంధీ కొండ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. కొండకు వెళ్లే దారిలో కొందరు బాలలు, యువత జంటలుగా ఉండి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. గాంధీ హిల్‌ని రూ.1.20 కోట్లతో అభివృద్ధి చేయగా, గత ఏడాది అక్టోబర్ 2న CM చంద్రబాబు ప్రారంభించారు. ప్రస్తుతం ఇది టీనేజర్లకు స్వర్గధామంగా మారిందని అక్కడికి వచ్చే కుటుంబ సభ్యులు పెదవి విరుస్తున్నారు. అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
News February 19, 2026
ఢిల్లీ AI సమ్మిట్‌లో బిల్ గేట్స్ స్పీచ్ రద్దు

ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్’లో బిల్ గేట్స్ ప్రసంగం రద్దయినట్లు గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. వివాదాల దృష్ట్యా సదస్సు ప్రాధాన్యం దెబ్బతినొద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో ఫౌండేషన్ ప్రతినిధి అంకుర్ వోరా ప్రసంగించనున్నారు. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’లో బిల్ గేట్స్ పేరున్న నేపథ్యంలో ప్రభుత్వమే ఆయన నుంచి దూరం పాటిస్తోందనే వాదనలూ వినిపిస్తున్నాయి.
News February 19, 2026
శ్రీకాకుళం IIITలో వేధింపులపై విచారణ

ఎచ్చెర్లలో ఉన్న శ్రీకాకుళం ఐఐఐటీ క్యాంపస్ సిబ్బంది విద్యార్థులను వేధిస్తున్నట్లు గతంలో వచ్చిన ఫిర్యాదుకు అంతర్గత కమిటీ విచారణ చేపట్టింది. బుధవారం ఇంజినీరింగ్ విద్యార్థులను, సిబ్బందిని వేర్వేరుగా విచారణ చేశారు. నూజివీడు క్యాంపస్‌కు చెందిన 6 మంది సభ్యుల కమిటీ విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.


