News August 28, 2025

సంగారెడ్డి: మోడల్ స్కూల్స్‌లో స్పాట్ అడ్మిషన్లు

image

జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మోడల్ స్కూల్స్‌లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఇటీవల 2025-26 విద్యా సంవత్సరానికి మోడల్‌ స్కూల్స్‌లో ఆరు నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షను నిర్వహించారు. జిల్లాలోని మునిపల్లి, పోతులబొగూడ తదితర పాఠశాలలో ఇంకా సీట్లు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు.

Similar News

News August 28, 2025

బిజినెస్‌మెన్‌ను పెళ్లాడనున్న హీరోయిన్!

image

హీరోయిన్ నివేదా పేతురాజ్ పెళ్లి పీటలెక్కనున్నారు. బిజినెస్‌మెన్ రాజ్‌హిత్ ఇబ్రాన్‌ను ఆమె వివాహం చేసుకోనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ జోడీ కలిసి దిగిన ఫొటోలను SMలో షేర్ చేశాయి. ఈ ఏడాదిలోనే అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగనున్నట్లు వెల్లడించాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని పేర్కొన్నాయి. నివేదా తెలుగులో మెంటల్ మదిలో, అల వైకుంఠపురంలో, పాగల్ తదితర చిత్రాల్లో నటించారు.

News August 28, 2025

భువనగిరి: మహిళకు లిఫ్ట్ ఇచ్చి ఏం చేశాడంటే..!

image

మహిళకు బైక్‌పై లిఫ్ట్ ఇచ్చి సుమారు ఆరు తులాల బంగారు ఆభరణాలను లాక్కెళ్లిన ఘటన బీబీనగర్‌ మండలంలో జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాలిలా.. ఇస్రాయిపల్లి కుంటకు చెందిన నెల్లుట్ల భారతమ్మ బీబీనగర్ నుంచి ఇస్రాయిపల్లి కుంటకు వెళుతోంది. గుర్తుతెలియని వ్యక్తి పల్సర్ బైక్‌పై వెళుతూ భారతమ్మకు లిఫ్ట్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఆమె నుంచి బంగారు ఆభరణాలు లాక్కుని పరారయ్యాడు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News August 28, 2025

VZM: ఈనెల 29న జాబ్ మేళా

image

విజయనగరం (D) జామి (M) భీమసింగిలోని శ్రీ బాలాజీ జూనియర్ కాలేజీలో ఈనెల 29న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ బుధవారం తెలిపారు. టెన్త్, ఇంటర్, ITI, డిప్లమా, డిగ్రీ, బీటెక్, ఏదైనా పీజీలో ఉత్తీర్ణత సాధించిన 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల యువతీ, యువకులు <>https://naipunyam.ap.gov.in <<>>లింక్ పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోండి.