News July 7, 2025
సంగారెడ్డి: యాప్‌లో వివరాలు నమోదు చేయాలి: డీఈవో

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. విద్యార్థులకు అందించిన పుస్తకాలు, యూనిఫామ్ వివరాలను అందులోనే నమోదు చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించే ప్రధాన ఉపాధ్యాయులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News July 7, 2025
కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించిన గవర్నర్

హనుమకొండ కలెక్టరేట్లో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంపై హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల్లో టీబీ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు కలెక్టర్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.
News July 7, 2025
సమస్యలను త్వరగా పరిష్కరించాలి: సంగారెడ్డి కలెక్టర్

సంగారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పి.ప్రావీణ్య పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడారు. సంబంధిత శాఖల అధికారులు ప్రజావాణి సమస్యలను పరిశీలించి, త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
News July 7, 2025
10న మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్

కోనసీమ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 10వ తేదీన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల స్థాయి విద్యాశాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారికి మీటింగ్ నిర్వహణపై పలు సూచనలు చేశారు.