News March 29, 2025
సంగారెడ్డి: యుద్ధ ట్యాంకర్ల తయారీకి ఒప్పందం

దేశ రక్షణలో ఎంత ఉపయోగపడే యుద్ధ ట్యాంకర్ల తయారీకి సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఆయుధ కర్మాగారంతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఒప్పందం చేసుకుంది. మిస్సెల్ పేరిట 293 యుద్ధ ట్యాంకర్లు, నామిస్ పేరుతో 13 అత్యాధునిక ట్యాంకర్ల తయారీకి ఒప్పందాలను కుదుర్చుకున్నారు. వీటిపై కేంద్ర రక్షణ శాఖ జాయింట్ సెక్రెటరీ డాక్టర్ అజయ్ కుమార్, ఓడిఎఫ్ సంస్థ చీఫ్ జీఎం శివశంకర ప్రసాద్ సంతకాలు చేశారు.
Similar News
News April 1, 2025
NRPT: ‘ప్రభుత్వం LRS గడువు పొడిగించాలి’

ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) గడువు మరో రెండు నెలలు పొడిగించాలని బీజేపీ నారాయణపేట జిల్లా అధికార ప్రతినిధి రఘువీర్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. సరైన ప్రచారం, అవగాహన లేని కారణంగా చాలా మంది ఎల్ఆర్ఎస్ రుసుం కట్టలేదని అన్నారు. వెంచర్లలో ప్లాట్లు కొన్న వారికి ఎల్ఆర్ఎస్ వర్తింపజేయాలని కోరారు. వెంచర్లు చేసిన వారికి ప్లాట్లు అమ్ముకునే అవకాశం కల్పించాలని అన్నారు.
News April 1, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News April 1, 2025
NLG: 2న SC సంఘం ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

షెడ్యూల్డ్ కులాల సంఘ ప్రతినిధులతో ఏప్రిల్ 2న నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 5న భారత మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, 14న డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.